ప్రేమజంట ఆత్మహత్య | - | Sakshi

ప్రేమజంట ఆత్మహత్య

Aug 10 2024 2:30 AM | Updated on Aug 10 2024 9:51 AM

-

యశవంతపుర: పెద్దల పంతాలకు యువతీ యువకుడు బలయ్యారు. ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలకోట జిల్లా రవకవి బనహట్టి తాలూకా నందగాంవ్‌ గ్రామంలో జరిగింది. సచిన్‌ దళవాయి (22), ప్రియా మడివాళర (19) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారు.

 అయితే వారి పెళ్లికి సచిన్‌ కుటుంబసభ్యులు ఒప్పుకోక పోవటంతో కలిసి జీవించలేమని తీవ్ర వ్యథకు గురయ్యారు. ఇద్దరూ కలిసి చనిపోవడమే మేలనుకున్నారు. గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మహాలింగపుర పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement