ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, చెన్నై: అంబత్తూరు రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ ఫాంలో సోమవారం ఉదయం ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఓ జంట ఆత్మహత్యచేసుకోవడం ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేసింది. ఆవడిమ రైల్వే ఎస్‌ఐ కమల కన్నన్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృత దేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. విచారణలో ఆ యువకుడు తిరువణ్ణామలైకు చెందిన జయకుమార్(25)గా తేలింది. ఆ యువతి వేలూరు శివారులోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతానికి చెందిన శరణ్యగా గుర్తించారు. ఈ ఇద్దరు చెన్నైలో పనిచేస్తున్నట్టు, ప్రేమలో పడ్డ ఈ జంటను విడదీయడానికి కుటుంబీకులు ప్రయత్నించినట్టు విచారణలో వెలుగు చూసింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించక పోవడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొవచ్చు అని పోలీసులు నిర్ధారించారు.
ప్రియుడి మృతితో.. తనువు చాలించింది
తిరుపత్తూరు జిల్లా ఆంబూరుకు చెందిన పుదుపేటకు చెందిన రమణన్(21), అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ప్రియుడితో ప్రియురాలు గొడవ పడింది. మనస్తాపం చెందిన రమణన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఈ ప్రియురాలు ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయింది. ఆమె కోసం రాత్రంతా కుటుంబీకులు గాలించారు. అయితే ఉదయాన్నే మృతదేహం సమీపంలోని రైలు పట్టాల మీద గుర్తించారు. రైలు ఢీకొనడంతో ఆ బాలిక శరీరం చిద్రమైంది.
తండ్రి మందలించాడని..
న్యూ వాషర్ మెన్ పేటకు చెందిన కందన్ కుమార్తె మేనక (19) అత్యధిక సమయం సెల్ ఫోన్‌తోనే గడిపేది. దీంతో ఆమెను సోమవారం తండ్రి మందలించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మేనక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment