![Extra Marital Affair: Wife Assassinated Husband Help Of Lover In Mahabubnagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/16/crime_0.jpg.webp?itok=egn_poYh)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ముగ్గురు ప్రియులతో కలిసి పథకం ప్రకారం భర్తను భార్య చంపేసినట్టు ఎనిమిది నెలల తర్వాత బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన చెరువుమీది పర్వతాలు (27) కు ఉదండాపూర్‌లోని యాదమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భార్య పలువురితో వివాహేతర సంబంధాలు కొనసాగించేది.
ఈ క్రమంలో భర్త ఓ ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయి ఇంట్లోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించి ప్రియులతో కలిసి హత్య చేసేందుకు యాదమ్మ పథకం పన్నింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ముగ్గురు ప్రియులతో కలిసి భర్త పర్వతాలుకు ఆమె అతిగా మద్యం తాపించింది. అపస్మారక స్థితికి చేరుకున్నాక చున్నీతో గొంతును బిగించి చంపేశారు. ఏమీ తెలియనట్టు లబోదిబోమంటూ మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు. చివరకు యాదమ్మతో పాటు పోలేపల్లికి చెందిన ఎన్నన్‌గండ్ల శివలింగం, ఎన్నన్‌గండ్ల మల్లేష్, గడ్డపు నాగరాజులను నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు నలుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి మొబైల్ ఫోన్ల్‌ను కోర్టుకు స్వాధీనం చేసినట్టు సీఐ రమేశ్‌బాబు తెలిపారు.
(చదవండి: మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్..)
Comments
Please login to add a commentAdd a comment