Petrol Poured on Loved Young Woman at Karnataka - Sakshi
Sakshi News home page

కాబోయే భర్తే కదా అని సహజీవనం చేసింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌..

Published Fri, Mar 18 2022 7:09 PM | Last Updated on Fri, Mar 18 2022 7:50 PM

Petrol Poured On Loved Young Woman At Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు: వారిది ఐదేళ్ల క్రితం చిగురించిన ప్రేమకథ. కాలేజీలో మొదలైన ప్రేమతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు బాగుండాలని పోటీపడి మరీ మచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. కాబోయే భర్తే కదా అని సహజీవనం కొనసాగించారు. ఇంతలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. ప్రియుడే ఆమె పాలిట యముడయ్యాడు. పాపం అని కూడా చూడకుండా ఆమెపై పెట్రోల్‌ పోసి తగలబెట్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. విజయపుర ఇంజనీరింగ్​ కాలేజీలో దానేశ్వరి(23), శివకుమార్ చంద్రశేఖర్ కలిసి చదువుకున్నారు. ఇంజనీరింగ్‌లోనే వారిద్దరూ ప్రేమించుకున్నారు. లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు సహజీవనం కూడా చేశారు. కాలేజీ అయిపోయాక ఉద్యోగం సంపాదించి హ్యాపీగా సమయం గడిచిపోతుండగా.. ఓ రోజు దానేశ్వరి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో చంద్రశేఖర్‌ తన పేరెంట్స్‌లో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పి ఇంటికి వెళ్లివచ్చాడు. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూస‍్తున్న ఆమెకు వచ్చిరాగానే షాకింగ్‌ వార్త చెప్పాడు. కులాలు వేరైన కారణంగా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. దీంతో తనను ఒప్పించాలని దానేశ్వరి అతడి ఆఫీసుకు వెళ్లి ప్రాధేయపడింది. కానీ, అతను మాత్రం ఒప్పుకోలేదు. 

ఇక, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్‌ చేసిన శివకుమార్‌.. దానేశ్వరితో మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న దానేశ్వరి అతడే ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దానేశ్వరి మృతి చెందింది. కాగా, యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement