Vasai Sayali Death: Boy Sagar Friend Found Dead At Bihar Hotel - Sakshi
Sakshi News home page

Vasai Sayali: ఇక్కడ సయాలీ.. అక్కడ సాగర్‌.. ప్రేమవిషాదం!

Published Tue, Mar 8 2022 10:03 AM | Last Updated on Tue, Mar 8 2022 12:46 PM

Vasai Sayali Death: Boy Sagar Friend Found Dead At Bihar Hotel - Sakshi

ఎనిమిదేళ్ల ప్రేమ.. సహజీవనం. విషయం బయటపడడంతో పెద్దలు ఏమంటారో అని ఆ జంటలో భయం. కానీ, పెద్దలు నవ్వుతూ వాళ్లను ఆశీర్వదించింది. త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. పాపం ఆ ప్రేమ కథ విషాదంగా ముగిసింది.


మహారాష్ట్ర ముంబై వసాయ్‌కు చెందిన సాగర్‌ అరుణ్‌ నాయక్‌(29), సయానీ ససానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి.  ఇంతలో.. 

ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలియదు. ఫిబ్రవరి 27వ తేదీన పాపిడిలోని ఓ హోటల్‌లో దిగింది ఈ జంట. ఆ తర్వాతి రోజు హోటల్‌ సిబ్బంది, తలుపులు ఎంత బాదినా అవతలి నుంచి స్పందన లేదు. చివరికి డోర్‌ బద్ధలు కొట్టి చూసేసరికి.. సయాలి విగతజీవిగా కనిపించింది. ప్లంబింగ్‌ పనిముటుతో ఆమెకు గాయపర్చి హత్య చేశారెవరో. ఈ కేసులో అనుమానితుడిగా ప్రియుడు సాగర్‌ పేరును చేర్చారు పోలీసులు. అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. సరిగ్గా వారం తర్వాత.. 


వేల కిలోమీటర్ల అవతల సాగర్‌!
సయాలి మరణం తర్వాత సాగర్‌ కనిపించకుండా పోవడంతో అతని మీద అనుమానంతో పోలీసులు వెతకసాగారు. ఇంతలో బీహార్‌ ఓ హోటల్‌ గదిలో శవమై కనిపించాడు సాగర్‌. సయాలీ మరణం తర్వాత బీహార్‌కు చేరుకున్న సాగర్‌..  ముజఫర్‌పూర్‌ని ఆస్తా హోట్‌లో దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మార్చి 6వ తేదీనే హోటల్‌ ఖాళీ చేయాల్సి ఉండగా.. అది జరగలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది డోర్లు లోపల నుంచి లాక్‌ చేసి ఉండడం గమనించారు. సాగర్‌ ఫోన్‌కు ట్రై చేసినా స్పందన లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టారు. లోపల బాత్‌రూంలో సాగర్‌ మృతదేహాంగా కనిపించాడు. బహుశా ఆత్మహ్యతకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు మిస్టరీ వీడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement