ప్రతీకాత్మక చిత్రం
ముంబై/పట్నా: ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తూ ప్రజల్ని బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు కొందరు మృగాళ్లు ఈ పరిస్థితులను అదునుగా తీసుకుని స్త్రీలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. పది రోజుల వ్యవధిలో బిహార్, మహారాష్ట్రలో ఇలాంటి అమానుష ఘటనలు రెండు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ(40) కరోనా లక్షణాలతో బాధపడుతూ.. నవీ ముంబైలోని క్వారంటైన్ సెంటర్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అదే చోట ఉన్న కరోనా పేషెంట్‌ను పరామర్శించే వంకతో అతడి సోదరుడు తరచూ అక్కడికి వచ్చేవాడు. బాధితురాలితో పరిచయం పెంచుకుని.. కరోనా సోకినా ధైర్యంగా పోరాడాలని, ఇందుకోసం తనకు చేతనైన సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు. (దారుణంగా హతమార్చి.. తలతో..)
ఇలా కొన్నిరోజులుగా క్వారంటైన్ సెంటర్‌లో ఆమెతో మాటలు కలిపిన నిందితుడు గురువారం రాత్రి లైంగిక దాడికి తెగబడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పన్వేల్ తాలూకా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతడిని గార్డు పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. మరోవైపు.. బాధితురాలికి కరోనా నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. (తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ ఎక్కించి..
బిహార్‌లో దారుణం
బిహార్‌లోని పట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రి(పీఎంసీహెచ్)లో ని క్వారంటైన్ సెంటర్లో ఉన్న మైనర్‌పై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. జూలై 8 రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. (మైనర్ అంగీకారంతోనే జరిగి ఉంటుంది.. కాబట్టి)
Comments
Please login to add a commentAdd a comment