Vasai
-
ఇక్కడ సయాలీ.. అక్కడ సాగర్.. ప్రేమవిషాదం!
ఎనిమిదేళ్ల ప్రేమ.. సహజీవనం. విషయం బయటపడడంతో పెద్దలు ఏమంటారో అని ఆ జంటలో భయం. కానీ, పెద్దలు నవ్వుతూ వాళ్లను ఆశీర్వదించింది. త్వరలో పెళ్లికి ముహూర్తం పెట్టింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు.. పాపం ఆ ప్రేమ కథ విషాదంగా ముగిసింది. మహారాష్ట్ర ముంబై వసాయ్కు చెందిన సాగర్ అరుణ్ నాయక్(29), సయానీ ససానే(26) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇంతలో.. ఆ జంట మధ్య ఏం జరిగిందో తెలియదు. ఫిబ్రవరి 27వ తేదీన పాపిడిలోని ఓ హోటల్లో దిగింది ఈ జంట. ఆ తర్వాతి రోజు హోటల్ సిబ్బంది, తలుపులు ఎంత బాదినా అవతలి నుంచి స్పందన లేదు. చివరికి డోర్ బద్ధలు కొట్టి చూసేసరికి.. సయాలి విగతజీవిగా కనిపించింది. ప్లంబింగ్ పనిముటుతో ఆమెకు గాయపర్చి హత్య చేశారెవరో. ఈ కేసులో అనుమానితుడిగా ప్రియుడు సాగర్ పేరును చేర్చారు పోలీసులు. అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. సరిగ్గా వారం తర్వాత.. వేల కిలోమీటర్ల అవతల సాగర్! సయాలి మరణం తర్వాత సాగర్ కనిపించకుండా పోవడంతో అతని మీద అనుమానంతో పోలీసులు వెతకసాగారు. ఇంతలో బీహార్ ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు సాగర్. సయాలీ మరణం తర్వాత బీహార్‌కు చేరుకున్న సాగర్.. ముజఫర్‌పూర్‌ని ఆస్తా హోట్‌లో దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మార్చి 6వ తేదీనే హోటల్ ఖాళీ చేయాల్సి ఉండగా.. అది జరగలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది డోర్లు లోపల నుంచి లాక్ చేసి ఉండడం గమనించారు. సాగర్ ఫోన్‌కు ట్రై చేసినా స్పందన లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టారు. లోపల బాత్రూంలో సాగర్ మృతదేహాంగా కనిపించాడు. బహుశా ఆత్మహ్యతకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు మిస్టరీ వీడాల్సి ఉంది. -
రైలులో కీకీ అన్నారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు
ముంబై : కీకీ చాలెంజ్ చాలా ప్రమాదకరం.. కీకీ అంటూ విన్యాసాలు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా జనాలు మాత్రం వాటిని బుర్రకెక్కించుకోవడం లేదు. దాంతో ఇన్ని రోజులు మందలించి వదిలేసిన పోలీసులు ఇప్పుడు మాత్రం కాస్తా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కీకీ చాలెంజ్ అంటూ కదులుతున్న రైలుతో పాటు విన్యాసాలు చేసిన ఒక యువకుడికి, ఈ తతంగాన్నంతా వీడియో తీసిన అతని స్నేహితులకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. కాకాపోతే అది కాస్తా వెరైటీ పనిష్మెంట్. రైల్వే ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేశారు కాబట్టి వరుసగా మూడు రోజుల పాటు రైల్వే స్టేషన్‌ను శుభ్రపర్చాలంటూ కోర్టు ఆ యువకులను ఆదేశించింది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని విరార్ ప్రాంతానికి చెందిన నిషాంత్ షా(20), ధ్రువ్ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు కీకీ ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందకి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్‌ఫాంపై రకరకాల విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. దాంతో అది కాస్తా పోలీసుల కంట పడింది. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సీసీ టీవీ, సదరు కీకీ వీడియోలోని దృశ్యాల ఆధారంగా ఆ ముగ్గురుని అరెస్టు చేశారు. అయితే ఈ యువకులు కీకీ పేరుతో ఇలా విన్యాసాలు చేయడం ఇదే ప్రథమం కాదని తెలిసిందే. గతంలో వీళ్లు ఏకంగా అంబులెన్స్ దగ్గర కూడా కీకీ ఛాలెంజ్ డ్యాన్స్ చేశారట. ఆ వీడియోను కూడా రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం వాళ్లను అరెస్టు చేసి వసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. యువకులను విచారించిన రైల్వే కోర్టు వారికి శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజుల పాటు వసాయ్ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాక ముగ్గురు యువకులు రైల్వే స్టేషన్‌ను శుభ్రపరుస్తుండగా వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలు, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ రైల్వే స్టేషన్‌ను శుభ్రం చెయ్యాలని కోర్టు ఆదేశించింది. -
పద్నాలుగేళ్లకే ఉగ్రవాదులపై ఫైటింగ్‌కు..
ముంబయి: పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు పద్నాలుగేళ్లకే పోరాటానికి పూనుకున్నాడు. భారత సరిహద్దుకు వెళ్లి ఉగ్రవాదులతో పోరాడుతానని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు చరిత్ర పుస్తకాలను అమితంగా ఇష్టపడే ఆ అబ్బాయి తాను కశ్మీర్ లో భారత్ సేనలకు సహాయంగా వెళతానని, శత్రువులైన ఉగ్రవాదులను ఏరిపారేస్తానని చెబుతూ ఆ ప్రకారమే ఇళ్లు విడిచి వెళ్లాడు. అయితే, అలా బయల్దేరిన అతడ్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకొని తిరిగి ఇంటికి చేర్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వసాయిలో నిర్మల్ వాగ్(14) అనే విద్యార్థి ఉన్నాడు. అతడు వసాయ్ లోని ఎంజీ పరులేకర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అతడి తల్లి చనిపోయింది. తోటి విద్యార్థులు బాగా విమర్శిస్తూ ఏడిపిస్తున్నారని సమాచారం. అయితే, తెలివైన విద్యార్థి అయిన నిర్మల్ తాను చదివే చరిత్ర పుస్తకాల నుంచి స్ఫూర్తిని పొంది సరిహద్దులో జవాన్లకు సేవ చేయాలని నిర్ణయించుకొని ఇంట్లో చెప్పకుండా ఆగస్టు 10న రాత్రి 10గంటల ప్రాంతంలో అమృత్ సర్ వెళ్లేందుకు గోల్డెన్ మెయిల్ రైలు ఎక్కాడు. అయితే, టికెట్ లేకుండా అతడు రైలు ఎక్కడంతో టికెట్ కలెక్టర్ గుజరాత్ లోని సూరత్ లో అర్థరాత్రి 1.15గంటల ప్రాంతంలో దింపేశాడు. అయితే, అదే వసాయ్ కి చెందిన ప్రభు ఆలి అనే మరో వ్యక్తిని, నిర్మల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని సంరక్షించారు. నిర్మల్ వద్ద రూ.2,500 డబ్బు ఉంది. కానీ, మొబైల్ ఫోన్ మాత్రం లేదు. నిర్మల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చేయడంతోపాటు స్కూల్ యాజమాన్యం, స్నేహితులు సామాజిక మాధ్యమాల్లో అతడి ఆచూకీకోసం విపరీతంగా ప్రయత్నించగా చివరకు అతడు ఆగస్టు 15నాటికి కుటుంబానికి చేరువయ్యాడు.