Actress Veena Kapoor Says I'm Alive, Files FIR Over Rumours That Her Son Killed Her - Sakshi
Sakshi News home page

Veena Kapoor: ప్రముఖ నటి హత్య కేసులో ఊహించని ట్విస్ట్‌.. బతికే ఉన్నానంటూ ప్రకటన

Published Thu, Dec 15 2022 6:42 PM | Last Updated on Thu, Dec 15 2022 8:13 PM

Actress Veena Kapoor Says Im Alive, Files FIR Over Rumours That Her Son Killed Her - Sakshi

ఆస్తి కోసం సీనియర్‌ నటి వీణా కపూర్‌ను కన్న కొడుకే హత్య చేశాడంటూ ఇటీవల జాతీయ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయిన విషయం తెలిసిందే కదా! తాజాగా అది అబద్ధమని, తాను బతికే ఉన్నానంటూ పోలీసుల ఎదుట ప్రత్యక్షమైంది నటి వీణా. తాను చనిపోయినట్లు పుకార్లు పుట్టించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ తన కుమారుడు అభిషేక్‌ చడ్డాతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై వీణా కపూర్‌ మాట్లాడుతూ.. 'నా కొడుకు నన్ను హత్య చేశాడన్నది పూర్తిగా అబద్ధం. అసలు నిజమేంటంటే వీణా కపూర్‌ పేరుతో ఉన్న మరో మహిళపై మర్డర్‌ జరిగింది. ఇక్కడ ఇద్దరి పేర్లు ఒకటే అయినంత మాత్రాన ఆ మరణాన్ని నాకు ఆపాదిస్తారా? నేను జుహులో కాదు, గుర్గావ్‌లో ఉంటున్నాను. నా కొడుకుతో కలిసి నివసిస్తున్నాను. నేను చనిపోలేదు, బతికే ఉన్నాను. దయచేసి అసత్యపు ప్రచారాన్ని నమ్మకండి. ఇప్పటికే దీనిపై మేము ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోనీలే అని కంప్లైంట్‌ చేయకుండా వదిలేస్తే రేపు ఇంకొకరికి కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పటికే వందల ఫోన్‌ కాల్స్‌తో నాకు మెంటల్‌ టార్చర్‌ అవుతుంది. షూటింగ్‌లో నా వర్క్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నాను. ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు' అని చెప్పుకొచ్చింది.

వీణా కపూర్‌ తనయుడు అభిషేక్‌ చడ్డా మాట్లాడుతూ.. 'అమ్మను ఎందుకు చంపావని చాలామంది ఫోన్‌ చేసి అడుగుతున్నారు. నేను తనను చంపలేదు, తను బతికే ఉంది. నేను నా తల్లిని కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వచ్చాయి. అది చూసి నేను అస్వస్థతకు లోనయ్యాను. అసలు ఇలాంటిది నేను కలలో కూడా ఊహించలేదు. అమ్మంటే నాకెంతో ఇష్టం. దయచేసి ఇక అసత్య ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి' అని కోరాడు.

కాగా ముంబైలో గతవారం వీణాకపూర్‌(74) అనే మహిళను కన్నకొడుకు సచిన్‌ కపూర్‌ బ్యాటుతో కొట్టి చంపాడు. ఆస్తి విషయంలో తగాదా రావడంతో బేస్‌బాల్‌ బ్యాటుతో తల్లి తలను పగలగొట్టి తర్వాత శవాన్ని నదిలో పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు.. పూరీపై హీరోయిన్‌ ఫైర్‌
ఎన్నోవారాలుగా రోహిత్‌కు అన్యాయం, చిట్టచివరకు ఒక్క ఛాన్స్‌ దొరికింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement