Veteran Actress Veena Kapoor Murdered by Son with Baseball Bat - Sakshi
Sakshi News home page

Veena Kapoor: నటి హత్య.. బ్యాటుతో కొట్టి చంపిన తనయుడు

Dec 10 2022 4:20 PM | Updated on Dec 10 2022 5:53 PM

Veteran Actress Veena Kapoor Murdered by Son with Baseball Bat - Sakshi

కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లి ఎవరో కాదు, సీనియర్‌ నటి వీణా కపూర్‌(74) అని తెలియడంs

ముంబై: ఆస్తి కోసం కన్నవాళ్లను కూడా కడతేర్చడానికి వెనకాడట్లేదు. డబ్బు పిచ్చితో పేగుబంధాన్ని మర్చిపోయి తల్లిదండ్రులనే చంపడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తి కోసం ఓ ముంబైవాసి తన తల్లిని బేస్‌బాల్‌ బ్యాటుతో పలుమార్లు కొట్టి చంపిన ఘటన ఎంతోమందిని కలిచివేసింది. కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లి ఎవరో కాదు, సీనియర్‌ నటి వీణా కపూర్‌(74) అని తెలియడంతో సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది.

ఆస్తి విషయంలో తగాదా రావడంతో వీణా కపూర్‌ను ఆమె కుమారుడు సచిన్‌ మంగళవారం నాడు హత్య చేశాడు. బేస్‌బాల్‌ బ్యాటుతో ఆమె తలను పగలగొట్టి, తర్వాత శవాన్ని ఓ నదిలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్‌తో పాటు అతడికి సాయం చేసిన లాలాకుమార్‌ మండల్‌ను అరెస్ట్‌ చేశారు. రూ.12 కోట్ల విలువైన ప్లాట్‌ విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే వీణా కపూర్‌ను హత్య చేసినట్లు సచిన్‌ నేరం అంగీకరించాడు.

వీణా కపూర్‌ మరణంపై ఆమె స్నేహితురాలు, నటి నీలూ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న వీణా కపూర్‌ మరో కుమారిడికి అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో సచిన్‌ తన తల్లిని చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఆస్తి గొడవల వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వీణాకు ఇలా జరగాల్సింది కాదు. నా గుండె పగిలింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మీకు ఇప్పటికైనా శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను.

చదవండి: షాకిచ్చిన బిగ్‌బాస్‌.. ఇనయ ఎలిమినేట్‌?
నిర్మాతల మండలిపై సురేశ్‌బాబు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement