Veteran Actress
-
Jamuna: కళాభారతికి నీరాజనం
'వంశీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘‘మీరజాలగలడా నా యానతి’’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి లు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. "తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు అభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. ఇవి చదవండి: అను వైద్యనాథన్: సాహసాల నుంచి నవ్వుల వరకు -
నేను మళ్లీ నటించడానికి కారణం అతనే..
-
పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. అలనాటి అందాల నటీమణులలో రాజశ్రీ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమా చేసి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. ఇక తెలుగు ఎన్టీఆర్, కాంతారావు వంటి స్టార్స్‌తో ఎక్కువగా నటించిన ఆమె జానపద జోనర్ చిత్రాలతో గుర్తింపొందారు. చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి? కెరీర్ పీక్స్‌లో ఉండగానే పొలిటికల్ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కొడుకు, మనవళ్లతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఆమె భర్త చనిపోయిన అనంతరం కఠిన పరిస్థితులు చూశానని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను, మూవీ కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయాక హైదరాబాద్‌కు పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసకున్నానని చెప్పారు. ‘‘హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. నాకు చెప్పకుండ పెళ్లి చూపులు అరెంజ్ చేశారు. అంతా ఒకే అయ్యి పెళ్లి అయిపోయింది. వివాహం తర్వాత సినీ పరిశ్రమ వైపు తొంగి చూడలేదు. అందరు నన్ను ఎంతో అదృష్టవంతురాలిగా చూశారు. రాజశ్రీకి ఏంటి ఆహా, తంతే బూరెల బుట్టలో పడింది’ అని అంతా నా గురించి మాట్లాడుకునేవారు’’ అని చెప్పారు. ‘అలా మా అత్తగారి వాళ్లది ఉన్నతమైన కుటుంబం కావడంతో గూటిలో పక్షిలా బతికాను. కొంతకాలానికి నా భర్త చనిపోయారు. దీంతో ఒక్ససారిగా నా జీవితం తలకిందులైంది. చదవండి: ఇకపై మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: ఖుష్బూపై చిరు ప్రశంసలు నా కొడుకు మూడేళ్లు ఉన్నప్పుడే ఆయన గుండెపోటుతో చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, పెళ్లయిన కొంతకాలానికే భర్త మరణించాడు. ఆ డిప్రెషన్‌తో నేను పదేళ్లు బయటకు రాలేదు. బయట ప్రపంచానికి నా ముఖం కూడా చూపించకుండ బతికాను. అప్పటి వరకు ఆహా అంటూ సాగిన నా జీవితం ఒక్కసారిగా కిందకు పడిపోయింది’ అంటూ వాపోయారు. ప్రస్తుతం తన కొడుకు అమెరికాలో సెటిలైయ్యాడని, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. తరచూ అమెరికా, ఇండియాకు తిరుగుతూనే ఉంటానని ఆమె తెలిపారు. -
నటి దారుణ హత్య, తల్లిని కిరాతకంగా చంపిన కుమారుడు
ముంబై: ఆస్తి కోసం కన్నవాళ్లను కూడా కడతేర్చడానికి వెనకాడట్లేదు. డబ్బు పిచ్చితో పేగుబంధాన్ని మర్చిపోయి తల్లిదండ్రులనే చంపడానికి సిద్ధపడుతున్నారు. ఆస్తి కోసం ఓ ముంబైవాసి తన తల్లిని బేస్‌బాల్ బ్యాటుతో పలుమార్లు కొట్టి చంపిన ఘటన ఎంతోమందిని కలిచివేసింది. కన్న కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లి ఎవరో కాదు, సీనియర్ నటి వీణా కపూర్(74) అని తెలియడంతో సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఆస్తి విషయంలో తగాదా రావడంతో వీణా కపూర్‌ను ఆమె కుమారుడు సచిన్ మంగళవారం నాడు హత్య చేశాడు. బేస్‌బాల్ బ్యాటుతో ఆమె తలను పగలగొట్టి, తర్వాత శవాన్ని ఓ నదిలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సచిన్‌తో పాటు అతడికి సాయం చేసిన లాలాకుమార్ మండల్‌ను అరెస్ట్ చేశారు. రూ.12 కోట్ల విలువైన ప్లాట్ విషయంలో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే వీణా కపూర్‌ను హత్య చేసినట్లు సచిన్ నేరం అంగీకరించాడు. వీణా కపూర్ మరణంపై ఆమె స్నేహితురాలు, నటి నీలూ కోహ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న వీణా కపూర్ మరో కుమారిడికి అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో సచిన్ తన తల్లిని చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఆస్తి గొడవల వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వీణాకు ఇలా జరగాల్సింది కాదు. నా గుండె పగిలింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మీకు ఇప్పటికైనా శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. View this post on Instagram A post shared by Nilu Kohli (@nilukohli) చదవండి: షాకిచ్చిన బిగ్‌బాస్.. ఇనయ ఎలిమినేట్? నిర్మాతల మండలిపై సురేశ్‌బాబు సంచలన వ్యాఖ్యలు -
ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత
Actress KPAC Lalitha Passes Away Celebrities Condolences: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటిపేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజండరీ నటి. ఆమె ఐదేళ్ల సినీ కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా సేవలు కూడా అందిచారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు. లిలిత మృతిపట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I’ve known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0 — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022 పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ లెజండరీ నటి మృతిపట్ల కీర్తి సురేష్, మంజూ వారియర్ భావోద్వేగపు పోస్ట్‌లు పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సంతాపం తెలియజేశారు. 'లలిత తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి అల్లుకుపోయారు. చరిత్రలో నిలిచిపోయారు' అని పేర్కొన్నారు. Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty. My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb — Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022 -
ప్రముఖ నటి బీ జయ ఇకలేరు
సాక్షి, బెంగళూరు: 2021 సంవత్సరం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిలుస్తోంది. ప్రముఖ కన్నడ సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న(జూన్ 3, గురువారం) తుదిశ్వాస విడిచారు. నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్యారెక్టర్ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. 1944లో జన్మించిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. 1958లో భక్తా ప్రహ్లాద చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్లో అనేర హాస్య, క్యారక్టెర్ పాత్రల్లో అభిమానుల్లోజయమ్మగా ప్రత్యేక పాత్రను దక్కించుకున్నారు. డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకేష్, బాలకృష్ణ వంటి తొలి తరం నటులతో ఆమె నటించారు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె టెలివిజన్ సీరియళ్లలో కూడా కనిపించారు. 2004-05లో గౌడ్రూ మూవీలో నటనకు గాను జయమ్మ ఉత్తమ సహాయక నటి అవార్డు గెల్చుకున్నారు. కాగా ఈ ఏడాదిలో ప్రముఖ కన్నడ నటుడు రాజారాంతో పాటు నటులు కృష్ణ గౌడ, గజరాజ్, దర్శకుడు రేణుక శర్మ, చంద్రు, మూవీ మిస్డ్ కాల్ నిర్మాత, నవీన్ కుమార్, వన్డే డైరెక్టర్, అన్నయ్య, నిర్మాత ఎం. చంద్రశేఖర్, కిచ్చా సుదీప్ రన్నా నిర్మాత, ఆర్ శ్రీనివాస్, పోస్టర్ డిజైనర్ ముస్తాన్, నిర్మాత రాము, డాక్టర్ డీఎస్ మంజునాథ్ తదితరులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి : SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
లెజెండరీ నటి కన్నుమూత
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సీనియర్ నటి కుంకుమ్ (86) కన్నుమూశారు. మదర్ ఇండియా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కుంకుమ్ అనారోగ్యంతో కారణంగా మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కుంకుమ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మరొక ఆణిముత్యాన్ని కోల్పోయామంటూ నవేద్ జాఫ్రీ ట్వీట్ చేశారు. 1954 లో ఆర్ పార్ చిత్రం లోని'కబీ ఆర్ కబీ పార్ లాగా తీరే నాజర్' పాటతో అడుగుపెట్టి నర్తకిగా తనదదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్లో దాదాపు 100 సినిమాలకు పైగానే నటించారు. కోహినూర్, ఉజాలా, ఏక్ సపేరా ఏక్ లూఠేరా, నయా దౌర్, రాజా ఔర్ రంక్, గీత్, ఆంఖేం, లల్కర్ ,.సీఐడి లాంటి ఎన్నో సినిమాల ద్వారా తన నటనా ప్రతిభను చాటుకున్నారు కుంకుమ్. yesteryear's film actress KUMKUM aunty, passed away, she was 86. she did so many films; songs & dances where picturized on her. did so many movies opposite dad #johnnywalker pic.twitter.com/Me63j4pd1Z — Nasirr Khan (@khanasirr) July 28, 2020 We have lost another gem. I have known her since I was a kid and she was family, a superb artist and a fantastic human being, innalillahe wa innailaihe raajeoon. Rest in peace kunkum aunty 🙏 #ripkumkum #kumkum pic.twitter.com/CT60alQbOC — Naved Jafri (@NavedJafri_BOO) July 28, 2020 -
మిస్ బాంబే ఇకలేరు
మిస్ బాంబే, ‘పక్కింటి అమ్మాయి’ అనిపించుకున్న బాలీవుడ్ నటి విద్యా సిన్హా (71) ఇకలేరు. గురువారం ముంబైలో ఆమె తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతున్నారు విద్యా. మోడలింగ్ నుంచి నటిగా మారి బసు చటర్జీ తీసిన ‘రజనీగంధ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు విద్యా. ప్రముఖ నిర్మాత రానా ప్రతాప్ సింగ్‌కు 1947 నవంబర్‌లో జన్మించారు విద్యా. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ‘మిస్ బాంబే’ కాంటెస్ట్‌లో పాల్గొని, ఆ టైటిల్‌ను సొంతం చేసుకున్నారామె. బాలీవుడ్లో కొత్తతరం హీరోయిన్ అనిపించుకుని, పక్కింటి అమ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నారు. 1968లో వెంకటేశ్వరన్ అయ్యర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె (జాన్వీ) ఉంది. వెంకటేశ్వరన్ మరణించిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యారు. ఆ తర్వాత కొంత కాలానికి నేతాజీ అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు. ‘పతీ, పత్నీ అవుర్ ఓ, చోటీ సే బాత్’ వంటి సినిమాలతో పాటు ‘కావ్యాంజలి, బాహు రాణి, జారా’ వంటి టీవీ సీరియల్స్‌లోనూ నటించారు విద్యా సిన్హా. 2011లోవచ్చిన సల్మాన్ ఖాన్ ‘బాడీగార్డ్’ సినిమాలోనూ నటించారామె. విద్యా సిన్హా మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది?
తమిళసినిమా: మనిషిలో మానవత్వం మరుగున పడుతోందా? లేక లేని మానవత్వం ముసుగులో మనిషి బతుకుతున్నాడా? ఒక వ్యక్తితో అవసరం ఉంటే ఆయన్ని మీ అంతటి వారు ఈ ధరణిలోనే లేరని బట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతారు.అవసరం లేకపోతే ఎదురుపడినా ముఖం చాటేసుకుని పోతుంటారు. ఈ దేశం ఎటు పోతోంది? మృగ్యమవుతున్న మానవత్వంలో మనిషి గమ్యం ఎటువైపు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో స్వార్థం పరుగులు తీస్తుందన్నది ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటనతో తేటతెల్లమైంది. ప్రజల్లో సానుభూతి కరువవుతోందని చెప్పక తప్పదు. భారతీయ స్టార్ డాన్సర్, నటీమణి జ్యోతిలక్ష్మి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె సాధారణ నటీమణి కాదు. తెలుగు,తమిళం,మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన గొప్పనటి, నర్తకి. ముఖ్యంగా తెలుగు,తమిళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అజరామర నటిగా కీర్తి గడించారు. జ్యోతిలక్ష్మి జీవించి ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన సినిమా జనం, డాన్సింగ్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురించిన వందిగామదులు ఆ నటీమణి కన్నుమూస్తే ఆమెకు నివాళులర్పించడానికి కూడా రాలేకపోయారు. తన కుటుంబానికి సానుభూతిని అందించే ప్రయత్నం చేయలేకపోయారు. ఐదు భాషా చిత్రాల్లో నర్తించి అశేష ప్రేక్షకులను అలరించిన జ్యోతిలక్ష్మిని చివరి చూపు చూడడానికి పట్టుమని పది మంది సినీ ప్రముఖులు కూడా రాలేదంటే మానవత్వం ఏ స్థాయిలో మంటగలుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో చానళ్ల కెమెరాల ముందు జ్యోతిలక్ష్మి లెజెండ్, డాన్సింగ్ క్వీన్ అంటూ నాలుగు ముక్కలు మాట్లాడి చేతులు దులిపేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ జ్యోతిలక్ష్మి సాధించిన కీర్తి తక్కువేమీ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరఫున సమాచార, ప్రచార శాఖామాత్యులు జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాంటిది ఇక్కడి చిత్ర ప్రముఖలు ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ సంతాపం తెలపకపోవడం విచారకరం. అదే రోజు ఒక తమిళ సీనియర్ రచయిత, దర్శక నిర్మాత కన్నుమూస్తే ప్రముఖ నటుల నుంచి, దర్శక నిర్మాతలు తరలి వెళ్లి నివాళులర్పించారు. మరి జ్యోతిలక్ష్మి తమిళ కుటుంబానికి చెందిన నటే. ఆమెకు ఆ సానుభూతి దక్కకపోవడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి ఒక్క జ్యోతిలక్ష్మికే కాదు ఇంతకు ముందు చాలా మంది విషయంలోనూ జరిగింది. ఒక ప్రఖ్యాత గీత రచయిత రాసిన ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్న గీత ం గుర్తుకొస్తోందీ సంఘటన చూస్తుంటే. ఈ ధోరణి మారాలి. మానవ విలువలు పెంపొందాలని ఆశిద్దాం. ఇది ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆలోచించాల్సిన అంశం ఇది. -
సీనియర్ నటి కన్నుమూత
ముంబై: సీనియర్ నటి శులభ దేశ్‌పాండే ముంబైలోని స్వగహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 79 ఏళ్ల శులభ పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్‌తో కలసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్‌పాండేతో కలసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. అరవింద్ దేశ్‌పాండే 1987లో మరణించారు. -
నటి ఫ్యామిలీలో ఆస్తి కోసం డిష్యూం డిష్యూం
చెన్నై : నటి మనోరమ ఆస్తి వ్యవహారం కుటుంబసభ్యుల మధ్య కలకలం రేపుతోంది. వేయికి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రఖ్యాత నటి మనోరమ. అలాంటి మనోరమపై ఆమె మనవరాలు అభిరామి (25) చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలుచేశారు. అందులో నటి బామ్మ మనోరమ ప్రఖ్యాత నటి అని, ఆమెకు చెన్నై తిరువళ్లూరు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం తన బామ్మ ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. తన చుట్టూ ఏమి జరుగుతోందో తెలియని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తన తండ్రి భూపతి మందుకు బానిసై మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన స్థానిక టీనగర్లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. వీరి అనారోగ్య పరిస్థితిని సాకుగా తీసుకుని తన సోదరుడు డాక్టర్ రాజరాజన్ తన బామ్మ ఆస్తులను తన పేరుకు మార్చుకున్నారని పేర్కొన్నారు. తన బామ్మ సొత్తులో తనకు సమభాగం చెందాలని తెలిపారు. అలాంటిది రాజరాజన్ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను అలాంటి చర్యలకు పాల్పడితే తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి లక్ష్మీకాంతన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై నటి మనోరమ కొడుకు భూపతి ఆయన భార్య ధనలక్ష్మి, కొడుకు రాజరాజన్ ఈ నెల 22వ తేదీ లోపు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
సీనియర్ నటి సూర్యకళ కన్నుమూత
సీనియర్ నటి కె.సూర్యకళ (72) సోమవారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కాకినాడకు చెందిన రామిరెడ్డి, సుభద్రల కుమార్తె సూర్యకళ బాల్యం నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. సినీరంగంపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. ఏయన్నార్, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ముఖ్య పాత్ర పోషించి మంచిపేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటిగా మంచి గుర్తింపు పొందారామె. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యకళ మొత్తం 500 చిత్రాలకు పైగా నటించారు. ఆమె చెన్నై నుంగంబాక్కంలోని వల్లువర్‌కోట్టం కాలనీలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సూర్యకళ సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. వీరికి పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. సూర్యకళ అంత్యక్రియలు మంగళవారం ఉదయం చెన్నైలో జరిగాయి.