మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి: ది రాజాసాబ్ నటి | Veteran Actress Zarina Wahab Comments On Prabhas, Says Wants A Son Like Him In My Next Life | Sakshi
Sakshi News home page

Zarina Wahab On Prabhas: రియల్ డార్లింగ్.. ప్రభాస్ లాంటి కొడుకు నాకు కావాలి: జరీనా

Published Thu, Nov 28 2024 11:38 AM | Last Updated on Thu, Nov 28 2024 12:09 PM

Veteran Avtress Zarina Wahab wants a son like Prabhas in her next life

టాలీవుడ్‌ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై సీనియర్ నటి జరీనా వాహబ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్‌ గురించి ఆమె మాట్లాడారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో  జరీనా వాహబ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె షూటింగ్‌ సెట్స్‌లో ప్రభాస్ తీరు గురించి ఆమె మాట్లాడారు. మరో జన్మంటూ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నానని జరీనా వెల్లడించారు.

జరీనా వాహబ్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ప్రభాస్‌తో ఓ మూవీ చేస్తున్నా. ది రాజాసాబ్‌లో నటిస్తున్నా. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. మరో జన్మ ఉంటూ ఉంటే నాకు ఇద్దరు కొడుకులు ఉండాలి. అందులో తప్పకుండా ప్రభాస్ లాంటి కుమారుడు నాకు కావాలని కోరుకుంటా. అంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. అతనొక స్టార్‌ అనే ఫీలింగ్‌ లేదు. సెట్‌లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తాడు. ఎవరైనా ఆకలితో ఉన్నారని  తెలిస్తే షూటింగ్‌ సిబ్బందితో పాటు అందరికీ భోజనాలు ఇంటికి ఫోన్ చేసి మరి తెప్పిస్తాడు. ప్రభాస్ నిజమైన డార్లింగ్' అంటూ ప్రశంసలు కురిపించింది.


ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న  గ్రాండ్ రిలీజ్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement