Veteran Actress Rajasree About Her Film Career And Husband In Latest Interview - Sakshi
Sakshi News home page

Senior Actress Rajasree: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, పదేళ్లు బయటకు రాలేదు: సీనియర్‌ నటి

Published Tue, Feb 28 2023 12:45 PM | Last Updated on Tue, Feb 28 2023 1:28 PM

Veteran Actress Rajasree About Her Film Career, Husband in Latest Interview - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. అలనాటి అందాల నటీమణులలో రాజశ్రీ ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వంటి స్టార్‌ హీరోల సరసన నటించారు. అప్పట్లోనే ఆమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమా చేసి స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఇక తెలుగు ఎన్టీఆర్‌, కాంతారావు వంటి స్టార్స్‌తో ఎక్కువగా నటించిన ఆమె జానపద జోనర్‌ చిత్రాలతో గుర్తింపొందారు.

చదవండి: భర్త కోసం నయన్‌ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్‌ ఇచ్చిన విజయ్‌ సేతుపతి?

కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే పొలిటికల్‌ ఫ్యామిలీకి కోడలిగా వెళ్లి సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం కొడుకు, మనవళ్లతో హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్న ఆమె భర్త చనిపోయిన అనంతరం కఠిన పరిస్థితులు చూశానని చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలను, మూవీ కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయాక హైదరాబాద్‌కు పొలిటికల్‌ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసకున్నానని చెప్పారు.

‘‘హీరోయిన్‌గా ఫుల్‌ బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా. నాకు చెప్పకుండ పెళ్లి చూపులు అరెంజ్‌ చేశారు. అంతా ఒకే అయ్యి పెళ్లి అయిపోయింది. వివాహం తర్వాత సినీ పరిశ్రమ వైపు తొంగి చూడలేదు. అందరు నన్ను ఎంతో అదృష్టవంతురాలిగా చూశారు. రాజశ్రీకి ఏంటి ఆహా, తంతే బూరెల బుట్టలో పడింది’ అని అంతా నా గురించి మాట్లాడుకునేవారు’’ అని చెప్పారు. ‘అలా మా అత్తగారి వాళ్లది ఉన్నతమైన కుటుంబం కావడంతో గూటిలో పక్షిలా బతికాను. కొంతకాలానికి నా భర్త చనిపోయారు. దీంతో ఒక్ససారిగా నా జీవితం తలకిందులైంది.

చదవండి: ఇకపై మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది: ఖుష్బూపై చిరు ప్రశంసలు

నా కొడుకు మూడేళ్లు ఉన్నప్పుడే ఆయన గుండెపోటుతో చనిపోయారు. మా అమ్మ చనిపోయింది, పెళ్లయిన కొంతకాలానికే భర్త మరణించాడు. ఆ డిప్రెషన్‌తో నేను పదేళ్లు బయటకు రాలేదు. బయట ప్రపంచానికి నా ముఖం కూడా చూపించకుండ బతికాను. అప్పటి వరకు ఆహా అంటూ సాగిన నా జీవితం ఒక్కసారిగా కిందకు పడిపోయింది’ అంటూ వాపోయారు. ప్రస్తుతం తన కొడుకు అమెరికాలో సెటిలైయ్యాడని, చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారు. తరచూ అమెరికా, ఇండియాకు తిరుగుతూనే ఉంటానని ఆమె తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement