సీనియర్ నటి కన్నుమూత | Veteran actor, theatre person Sulabha Deshpande dies at 79 | Sakshi
Sakshi News home page

సీనియర్ నటి కన్నుమూత

Published Sun, Jun 5 2016 10:55 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

సీనియర్ నటి కన్నుమూత - Sakshi

సీనియర్ నటి కన్నుమూత

ముంబై: సీనియర్ నటి శులభ దేశ్పాండే ముంబైలోని స్వగహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

79 ఏళ్ల శులభ పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్తో కలసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్పాండేతో కలసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. అరవింద్ దేశ్పాండే 1987లో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement