నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌స్థల అన్వేషణ కోసం సోమవారం రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులు పట్టణంలో పరిశీలన చేశారు.
నరసాపురం : నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌స్థల అన్వేషణ కోసం సోమవారం రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులు పట్టణంలో పరిశీలన చేశారు. నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ ఎలైన్‌మెంట్ ప్రకారం నరసాపురం పట్టణం నుంచి కాకుండా, చిట్టవరం గ్రామం వద్ద నుంచి వేయాల్సి ఉంది. ఈ లైన్ బహుళ ప్రయోజనకారిగా ఉండాలంటే, నరసాపురం పట్టణం మీదుగానే వేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో నరసాపురం పట్టణం నుంచి రైల్వేలైన్ వేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, రైల్వేశాఖ డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ కె.సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఎం.వి.నిర్మల, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పర్యటించారు. రైల్వేస్టేçÙన్, పొననపల్లి, మాధవాయిపాలెం ఫెర్రీ ప్రాంతాలను పరిశీలించారు. రూట్‌మ్యాప్‌ను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకూ నరసాపురం పట్టణం నుంచే, ప్రాజెక్ట్ ఉండేలా యత్నిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నట్టు వివరించారు.