Kotipalli
-
కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద
సాక్షి, కోటిపల్లి(తూర్పు గోదావరి): గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లాంచి(పంటి) ప్రయాణాన్ని గురువారం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో రక్షణ చర్యలను చేపట్టారు. కోటిపల్లి గెస్ట్‌హౌస్ వద్ద వరద ఉధృతిని తట్టుకునేందుకు కర్రలు, ఇసుక బస్తాలతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కోటిపల్లి వద్ద వరద ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోటిపల్లి, ముక్తేశ్వరం నుంచి నిత్యం లాంచిలపై వెళ్లే వ్యాపారులు, కూలీలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కోటిపల్లి రైల్వేలైన్‌పై పరిశీలన
నరసాపురం : నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌స్థల అన్వేషణ కోసం సోమవారం రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులు పట్టణంలో పరిశీలన చేశారు. నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ ఎలైన్మెంట్ ప్రకారం నరసాపురం పట్టణం నుంచి కాకుండా, చిట్టవరం గ్రామం వద్ద నుంచి వేయాల్సి ఉంది. ఈ లైన్ బహుళ ప్రయోజనకారిగా ఉండాలంటే, నరసాపురం పట్టణం మీదుగానే వేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో నరసాపురం పట్టణం నుంచి రైల్వేలైన్ వేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, రైల్వేశాఖ డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ కె.సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ ఎం.వి.నిర్మల, నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పర్యటించారు. రైల్వేస్టేçÙన్, పొననపల్లి, మాధవాయిపాలెం ఫెర్రీ ప్రాంతాలను పరిశీలించారు. రూట్‌మ్యాప్‌ను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకూ నరసాపురం పట్టణం నుంచే, ప్రాజెక్ట్ ఉండేలా యత్నిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నట్టు వివరించారు. -
కోటిపల్లిలో పెద్దపులి సంచారం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కొటిపల్లి మండలంలో గురువారం పెద్దపులి సంచరించింది. దీంతో స్థానికలు ఆందోళన చెందుతున్నారు. పులి సంచరిస్తుండంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోటిపల్లి గ్రామీణ సీఐ రాములు తెలిపారు. (కోటిపల్లి) -
నాకిప్పుడే పెళ్లొద్దు..!
బాల్య వివాహం ఓ సాంఘిక దురాచారం.. చట్టరీత్యా నేరం.. అయినా గ్రామాల్లో ఇప్పటికీ లోకం తెలియని వయసులోనే పెళ్లి పీటలెక్కుతున్న పుత్తడి బొమ్మ.. పూర్ణమ్మలు ఎందరో ఉన్నారు. సంప్రదాయాల మాటున తల్లిదండ్రులు లేత వయసులోనే ఆడబిడ్డల మెడలో మూడుముళ్లు వేయించి.. వారి బతుకులను ముళ్లబాటలోకి నెట్టేస్తున్నారు. ఈ దురాచారాన్ని ఎదుర్కొనే తెగువ ఎంతమందికుంటుంది!.. దానికి సమాధానంగా నేనున్నానంటూ ఓ బాలిక ముందు కొచ్చింది. తల్లిదండ్రుల ప్రయత్నాన్ని అడ్డుకోలేక.. సమాజానికి లేఖ రూపంలో తన అభిమతాన్ని వెల్లడించింది. ‘నాకిప్పుడే పెళ్లొద్దు.. చదువుకుంటాను’.. అంటూ నిక్కచ్చిగా చెప్పింది. ‘నాకు చదువుకోవాలని ఉంది సార్.. ఇంట్లో వాళ్లు చదువుకోవాలనే ఆలోచన రాకుండా చేస్తున్నారు. వచ్చే నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. నన్ను ఇంట్లోనే బందీని చేశారు. నాకు పెళ్లి ఇష్టం లేదు. మీరే కదా సార్ చెప్పారు.. చదువుకొనే వాళ్లు జీవితంలో బాగుపడతారని, అందుకే నాకు చదువుకోవాలని ఉంది సార్.. అందుకే నా పెళ్లి ఆపండి.. లేకపోతే నాకు చావే మార్గం సార్. మా అన్నయ్య చదువుకోమని మొదట్లో ప్రోత్సహించేవాడు. ఇప్పుడేమో ఇంకోలా అంటున్నాడు.’.. ఇదీ ఓ బాలిక తన పాఠశాల ఉపాధ్యాయులకు రాసిన లేఖలోని సారాంశం. ఈ బాలిక స్వగ్రామం పొందూరు మండలంలోని మారుమూలన ఉన్న కోటిపల్లి. మజ్జిలిపేట అప్‌గ్రేడెడ్ యూపీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలికను మరో నెల రోజుల్లో మరో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానుంది. ఫిబ్రవరి 22న ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ‘నాకు అప్పుడే పెళ్లేమిటి.. చదువుకుంటాను’ అంటూ తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకుంది. ప్రతిఘటించింది. ఆమె వేదన అరణ్యరోదనే అయ్యింది. ఇంట్లో దాదాపు బందీగా మారింది. దాంతో బాగా ఆలోచించింది. తన బతుకును తనే చక్కదిద్దుకోవాలని, అందుకు తన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. తన గోడును వెల్లడిస్తూ పాఠశాల ఉపాధ్యాయుల పేరిట ఈ నెల 21న ఓ లేక రాసి నానా కష్టాలు పడి హెల్పింగ్ హ్యాండ్స్(శ్రీకాకుళం) సంస్థ ప్రతినిధులకు అందేలా చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు లేఖను బాలిక చదువుకుంటున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి శనివారం అందజేశారు. ఆయన ఈ విషయాన్ని విలేకరులకు వివరించగా.. వారు చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ అయిన 1098కు సమాచారం అందించారు. దాంతో వారు రంగంలోకి దిగారు. స్థానిక ఐసీడీఎస్ ఏసీడీపీవో సంతోషికుమారి, శ్రీకాకుళం ఐసీడీఎస్ కౌన్సెలర్ సీతారాం, వైసీబీ చైల్డ్‌లైన్ ప్రతినిధి గన్నెప్పడులు మధ్యాహ్నం కోటిపల్లిలోని బాలిక ఇంటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని కౌన్సెలింగ్ చేశారు. ఆప్పుడే బాలికకు పెళ్లి చేయవద్దని హితవు చెప్పారు. 13 ఏళ్ల బాలికకు పెళ్లి చేయడం నేరమని కూడా హెచ్చరించారు. అయితే వారు ససేమిరా అన్నారు. పెళ్లి చేయడం తథ్యమని స్పష్టం చేయడంతో విషయాన్ని బాలికల సంక్షేమ సమితి(సీడబ్ల్యూసీ)కి నివేదిస్తామని అధికారులు చెప్పారు. బాలిక వివరాలను స్థానిక తహశీల్దార్ భువన్మోహన్కు అందజేశామని కూడా వారు చెప్పారు. - పొందూరు -
రహదారులకు పుష్కర శోభ
సాక్షి, రాజమండ్రి :నాలుగు నెలల చర్చోపచర్చల అనంతరం ప్రభుత్వం పుష్కరాల దిశగా తొలి అడుగు వేసి రహదారుల నిర్మాణానికి ఉత్తర్వులిచ్చింది. పుష్కర పనుల్లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో రూ.133 కోట్లతో రోడ్ల పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. వీటిలో రూ. 87.55 కోట్లను మన జిల్లాలో 17 పనులు చేపట్టేందుకు కేటాయించారు. జిల్లాలో ప్రధానంగా పుష్కరాలకు భక్తుల తాకిడి ఉండే ప్రాంతాల్లో ఉన్న రహదారులకు ఈ నిధులు విడుదల చేశారు. పనులు 2015 జూన్ నాటికి పూర్తయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రోడ్లకే కొత్త రూపు.. ఆలమూరు నుంచి కోటిపల్లి వరకూ 17 కిలోమీటర్ల రహదారిని రూ.9.90 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఆలమూరు నుంచి కోటిపల్లి మధ్యలో ఆరు కిలోమీటర్లు, కోటిపల్లి నుంచి పిల్లంక వరకూ తొమ్మిది కిలో మీటర్ల రోడ్లను రూ. 9.75 కోట్లతో మరమ్మతు చేస్తారు. అమలాపురం నుంచి నేదునూరు మీదుగా అయినవిల్లికి కలిపే రోడ్డును 8.6 కిలోమీటర్ల మేర రూ.ఆరు కోట్లతో మరమ్మతు చేస్తారు. టేకిశెట్టిపాలెం నుంచి అంతర్వేదికి వెళ్లే 13.4 కిలోమీటర్ల రోడ్డును రూ.3.90 కోట్లతో అభివృద్ధి చేస్తారు. సఖినేటిపల్లి నుంచి అంతర్వేది రోడ్లో 11 కిలోమీటర్లను రూ.3.40 కోట్లతో మెరుగుపరుస్తారు. రాజమండ్రి నగర పరిధిలో 1.5 కిలోమీటర్ల మేర పాైడె న బైపాస్ రోడ్డుకు రూ.1.30 కోట్లతో మరమ్మతులు చేస్తారు. రాజమండ్రి నుంచి సీతానగరం మండలం చినకొండేపూడి వరకూ 24 కిలోమీటర్ల రోడ్డును రూ.8.00 కోట్లతో అభివృద్ధి చేస్తారు. మామిడికుదురు నుంచి గోగన్నమఠం వరకూ ఏడున్నర కిలోమీటర్ల రోడ్డును రూ. 3.45 కోట్లతో అభివృద్ధి పరుస్తారు. కోటిపల్లి నుంచి పిల్లంక వరకూ 4.5 కిలోమీటర్లు, పిల్లంక నుంచి యానాం వరకూ 5.3 కిలోమీటర్ల రోడ్ల బాగుకు రూ.7.80 కోట్లు వెచ్చిస్తారు. బాలాంత్రం నుంచి బ్రహ్మపూడి వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డును రూ.4.00 కోట్లతో అభివృద్ధి చేస్తారు. రోడ్‌కం రైలు వంతెనకు రూ.3 కోట్లు రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు వంతెన ప్రత్యేక మరమ్మతులకు రూ.3.00 కోట్లు కేటాయించారు. ఈ వంతెన నుంచి ధవళేశ్వరం కాటన్ గెస్ట్‌హౌస్ వరకూ గోదావరి గట్టు రోడ్డును 7.5 కిలోమీటర్ల మేర వెడల్పుచేసి పటిష్ట పరిచేందుకు రూ.3.5 కోట్లు కేటాయించారు. రాజమండ్రి నగర పరిధిలోని హకుంపేట రోడ్డును రెండు కిలోమీటర్ల మేర రూ.మూడు కోట్లతో వెడల్పు చేస్తారు. రాజమండ్రి నుంచి ముగ్గళ్ల వరకూ గోదావరి గట్టు రోడ్డు 14 కిలోమీటర్ల మేర మరమ్మతులకు రూ.3.15 కోట్లు వెచ్చించనున్నారు. రూ.17.40 కోట్లతో ఏపీఆర్డీసీ పనులు ఆర్అండ్బీ శాఖకు అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి-కాకినాడ రోడ్డును రూ.10 కోట్లతో ఏడు కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. రాజమండ్రి- మారేడుమిల్లి రోడ్డుకు నగరం శివార్లో ఐదు కిలోమీటర్ల మేర రూ.5.10 కోట్లతో మరమ్మతులు చేస్తారు. ద్వారపూడి-యానాం వెళ్లే రోడ్డుకు ద్రాక్షారామ పరిధిలో రూ.2.30 కోట్లతో మరమ్మతులు చేస్తారు.