సాక్షి, కోటిపల్లి(తూర్పు గోదావరి): గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లాంచి(పంటి) ప్రయాణాన్ని గురువారం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో రక్షణ చర్యలను చేపట్టారు. కోటిపల్లి గెస్ట్‌హౌస్ వద్ద వరద ఉధృతిని తట్టుకునేందుకు కర్రలు, ఇసుక బస్తాలతో అవసరమైన ఏర్పాట్లు చేశారు. కోటిపల్లి వద్ద వరద ప్రవాహంపై అధికారులు ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరదల నేపథ్యంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోటిపల్లి, ముక్తేశ్వరం నుంచి నిత్యం లాంచిలపై వెళ్లే వ్యాపారులు, కూలీలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment