Operating systems
-
డయాగ్నస్టిక్ కంపెనీలకు ఇబ్బందే
ముంబై: వ్యాధి నిర్ధారణ సేవల్లోని కంపెనీల (డయాగ్నస్టిక్స్) ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం తగ్గొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. కరోనా పరీక్షలు గణనీయంగా తగ్గిపోవడం ఆదాయాల క్షీణతకు దారితీస్తుందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున ఉండడంతో కంపెనీలు ఆదాయంలో 30 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. వైరస్ ప్రభావం క్షీణించడం, స్వయంగా పరీక్షించుకునే కిట్లకు ప్రాధాన్యం ఇస్తుండడం డయాగ్నస్టిక్స్ కంపెనీల ఆదాయాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సంరలో ప్రభావితం చేస్తుందన్నది క్రిసిల్ విశ్లేషణగా ఉంది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో కంపెనీల లాభాల మార్జిన్లు దశాబ్ద గరిష్టమైన 28 శాతానికి చేరుకోగా, అవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24–25 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ తెలిపింది. ఆదాయం తగ్గడానికితోడు అధిక నిర్వహణ వ్యయాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌పై అధిక వ్యయాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపిస్తాయని వివరించింది. అయినప్పటికీ మెరుగైన నగదు ప్రవాహాలు, పటిష్ట మూలధన వ్యయ విధానాలు (ఎక్విప్మెంట్ తదితర), రుణ భారం తక్కువగా ఉండడం వంటివి ఈ రంగంలోని కంపెనీల బ్యాలన్స్ షీట్లను ఆరోగ్యంగానే ఉంచుతాయని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. ఈ రంగంలోని 11 సంస్థల బ్యాలన్స్ షీట్లను క్రిసిల్ విశ్లేషించింది. పెరిగిన పోటీ.. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా టెస్ట్‌ల ద్వారా ఆదాయం మొత్తం ఆదాయంలో 20 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనట్టు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కాకపోతే ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపంలో ఆదాయం 12–14 శాతం మేర పెరగడంతో ఈ ప్రభావాన్ని చాలా వరకు అవి అధిగమిస్తాయని చెప్పారు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థలు ల్యాబ్ టెస్ట్‌లను కూడా ఆఫర్ చేస్తుండడంతో ఈ రంగంలో పోటీ పెరిగినట్టు క్రిసిల్ వెల్లడించింది. కాకపోతే వైద్యులు సూచించే పరీక్షలకు ఆన్లైన్ సంస్థల నుంచి పోటీ ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆన్లైన్ సంస్థలు సొంతంగా సదుపాయాలపై పెట్టుబడులు పెట్టుకుండా, స్థానిక వ్యాధి నిర్ధారణ కేంద్రాలతో టైఅప్ పెట్టుకుని కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో నిలదొక్కుకున్న సంప్రదాయ డయాగ్నస్టిక్ సంస్థలు డిజిటల్ సదుపాయాలు, రోగి ఇంటికి వెళ్లి నమూనాల సేకరణకు పెట్టుబడులు పెంచాల్సిన పరిస్థితులను కల్పిస్తోంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. భవిష్యత్తులో మరోసారి కరోనా వైరస్ మరింత తీవ్రరూపం దాల్చడం, ఆన్లైన్ సంస్థల నుంచి పెరిగే పోటీ, మార్కెట్ వాటా పెంచుకోవడాన్ని పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఆపిల్ నుంచి అప్డేట్స్
వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఆపిల్ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్ప్యాడ్, ఐప్యాడ్ , ఐవాచ్, ఆపిల్ టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్లలలో ఆపిల్మార్పులు తీసుకురాబోతుంది. జూన్ 7 నుంచి 11 వరకు జరిగే వలర్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ఈ వివరాలు వెల్లడించనుంది. ఇంటెల్ స్థానంలో జూన్ 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా వర్చువల్ పద్దతిలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ వేదికగా తమ ఉత్పత్తుల్లో తీసుకురాబోయే అప్డేట్స్ ఆపిల్ సంస్థ ప్రకటించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాక్ప్యాడ్కు సంబంధించి హార్డ్‌వేర్‌లో కీలక మార్పులు ఆపిల్ తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆపిల్ మాక్ప్యాడ్లలో ఇంటెల్ ప్రాసెసర్లు ఉపయోగించగా... ఇకపై వాటి స్థానంలో ఆపిల్ స్వంతగా రూపొందించిన ప్రాసెసర్లు వినియోగిస్తారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం జూన్ 7న ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడికానుంది. ఆపరేటింగ్‌లో అప్డేట్స్ మ్యాక్ప్యాడ్, ఐప్యాడ్, టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌లో కీలక అప్డేట్స్ను ఆపిల్ ప్రకటించనుంది. ఆపిల్ ఉత్పత్తులు మరింత ప్రభావంతంగా పని చేసేలా, యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్డేట్స్ ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మ్యాక్ప్యాడ్కి సంబంధించి ఓఎస్ 12, ఆపిల్ ఫోన్లకు సంబంధించి ఓఎస్ 15లో ఉండే కీలక ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీలో ఆపిల్ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది. కరోనా కల్లోలం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ వినియోగదారులకు ఆరోగ్య సమాచారం అందించేలా తన ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు ఆపిల్ తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఈ నెల 29న విండోస్ 10 ఆవిష్కరణ
న్యూఢిల్లీ సహా 13 నగరాల్లో రిలీజ్ ఉచితంగా అప్‌గ్రేడ్ పరిమిత కాలానికే న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేటెస్ట్ వెర్షన్, విండోస్ 10ను జులై 29న ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఆవిష్కరించనుంది. న్యూయార్క్ సిటీ, సిడ్నీ, టోక్యో, బీజింగ్ తదితర ఇతర నగరాలతో పాటు న్యూఢిల్లీ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటిదాకా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త వెర్షన్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు పరిమిత కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇస్తోంది. విండోస్ 8/8.1 లేదా 7 వెర్షన్‌ను ఉపయోగిస్తున్న డివైజ్‌లకు ఉచిత అప్‌గ్రేడ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఒకదానితో మరొకటి అనుసంధానించుకుని ఉపయోగించుకునేందుకు కొత్త వెర్షన్ ఉపయోగపడుతుంది. కొత్త శకానికి నాంది... పర్సనల్ కంప్యూటింగ్‌కు సంబంధించి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కొత్త శకానికి నాంది పలకగలదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఫోన్స్ నుంచి మైక్రోసాఫ్ట్ తొలి హోలోగ్రాఫిక్ కంప్యూటర్ దాకా ప్రతి డివైజ్ పైనా ఇది పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ 2015లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల పేర్కొన్నారు. కంపెనీపరమైన కొత్త ప్రణాళికల గురించి వ్యాపార భాగస్వాములకు వివరించేందుకు మైక్రోసాఫ్ట్ ఏటా పార్ట్నర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. -
న్యాయ వ్యవస్థలో జోక్యం తగదు: సీజేఐ
వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ముఖ్యం ‘జడ్జీల బిల్లు’కు పార్లమెంటు ఆమోదం మర్నాడే వ్యాఖ్యలు న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ, పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పర గౌరవాన్ని పాటించాలని, ఆయా వ్యవస్థల బాధ్యతల నిర్వహణకు బయటినుంచి అడ్డంకులు ఎదురుకాకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఆర్ఎం లోధా అభిప్రాయపడ్డారు. న్యాయ, కార్యనిర్వహక వ్యవస్థలతోపాటు పార్లమెంటు ప్రతినిధులకు, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిపక్వత ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థ వ్యవహారాల పరిధిలో పార్లమెంటు, కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడారు. రాజ్యవ్యవస్థలన్నీ ఇతర వ్యవస్థల విధుల్లో జోక్యంచేసుకోకుండా ఉండేలా రాజ్యాంగ నిర్మాతలు తగిన చర్యలు తీసుకున్నారని, కానీ జ్యుడిషియరీ అభిప్రాయాలను పట్టించుకోకుండానే,.. న్యాయమూర్తుల నియామకానికి కొత్త వ్యవస్థ ఏర్పాటుకోసం రెండు బిల్లులను పార్లమెంటు ఆమోదించిందని జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థను రద్దుచేసే బిల్లును పార్లమెంటు ఆమోదించిన మర్నాడే జస్టిస్ లోధా ఈ వ్యాఖ్యలు చేశారు. -
ట్యాబ్లెట్స్‌కి స్మార్ట్ఫోన్ల దెబ్బ
న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్లతో వస్తున్న స్మార్ట్ఫోన్లు (ఫాబ్లెట్స్) .. ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో జనవరి-మార్చి త్రైమాసికంలో అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్ల అమ్మకాలు 3.9 శాతం మాత్రమే పెరిగాయి. 5.04 కోట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రితం త్రైమాసికంతో పోలిస్తే ట్యాబ్లెట్లు, టూ ఇన్ వన్ల (డిటాచబుల్ కీబోర్డులతో కూడిన ట్యాబ్లెట్స్) విక్రయాలు 35.7 శాతం క్షీణించాయి. 2013 క్యూ1తో పోలిస్తే 3.9 శాతం మాత్రమే పెరిగాయి. అప్పట్లో ట్యాబ్లెట్స్ అమ్మకాలు 4.86 కోట్లు. ఆపరేటింగ్ సిస్టమ్‌లు, స్క్రీన్ సైజులు అంటూ తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ విక్రయాలు మందగించాయని, రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని ఐడీసీ తెలిపింది. యాపిల్, అసూస్, అమెజాన్ వంటి కంపెనీల అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొంది. ఫ్యాబ్లెట్లు 5-7 అంగుళాల స్క్రీన్‌తో ఉంటున్నాయి. పెద్ద స్క్రీన్ ఫోన్ల అమ్మకాలు పెరుగుతుండటం, ఇప్పటికే ట్యాబ్లెట్స్ తీసుకున్న వారు మళ్లీ కొత్తవి తీసుకోకుండా పాతవాటితోనే సర్దుకుపోతుండటం కూడా ట్యాబ్లెట్ల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయని ఐడీసీ ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ (డివెజైస్ అండ్ డిస్ప్లేస్) టామ్ మైనెలి తెలిపారు. మిగతా కంపెనీలతో పోలిస్తే యాపిల్ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ.. కంపెనీ ట్యాబ్లెట్ల అమ్మకాలు 1.95 కోట్ల నుంచి 1.64 కోట్లకు తగ్గిపోయాయి. మార్కెట్ వాటా కూడా 40.2 శాతం నుంచి 32.5 శాతానికి పడిపోయింది. మరోవైపు, శాంసంగ్ మాత్రం తన వాటాను 17.5% నుంచి 22.3%కి పెంచుకోగలిగింది. అమ్మకాలు 85 లక్షల నుంచి 1.12 కోట్లకు పెరిగాయి. దాదాపు మూడింట రెండొంతల వాటాతో ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఆండ్రాయిడ్ ఆధిపత్యం కొనసాగుతుండగా, విండోస్ డివైజ్‌లు కూడా పుంజుకుంటున్నాయని ఐడీసీ రీసెర్చ్ అనలిస్ట్ జితేష్ ఉబ్రాని తెలిపారు.