చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట | Facebook activates Safety Check feature in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట

Published Fri, Dec 4 2015 2:48 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట - Sakshi

చెన్నై వరద బాధితులకు ఫేస్బుక్ బాసట

అండగా సోషల్ మీడియా...
సంతోషాలను పంచుకోవడానికే కాదు కష్టాలను పంచుకోవడానికి, వీలైతే సాయం చేయడానికి కూడా చాలమంది సోషల్ మీడియాను ఓ వేదికగా చేసుకుంటున్నారు. వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై వాసుల కోసం నెటిజన్లేకాదు.. సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, గూగుల్, జిప్పర్ వంటి సంస్థలు కూడా తమదైన శైలిలో సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.
 
ఫేస్‌బుక్ సేఫ్టీచెక్..
వరదల్లో చిక్కుకున్న తమవారి పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన పడుతున్నవారికి ఊరట కల్పించేందుకు ఫేస్‌బుక్ సంస్థ ‘సేఫ్టీ చెక్’ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ ‘సేఫ్టీచెక్’ టూల్‌ని క్లిక్ చేస్తేచాలు... స్నేహితులకు, బంధువులకు, వారి ఖాతాలో ఉన్నవారందరికీ క్షేమంగా ఉన్నారనే సమాచారం వెళ్లిపోతుంది.
 
పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించనున్న గూగుల్

నగరంలో ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? వదర నీరు ఎక్కడ తగ్గుముఖం పట్టింది? ఎక్కడ వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది? ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలేవీ? ఏ ప్రాంతంలో ఉండడం క్షేమకరం? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ సంస్థ ‘రిసోర్స్ ఫర్ చెన్నై ఫ్లడ్స్’ అంటూ ప్రత్యేక లింక్ ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు, సాయం చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాల గురించి చెబుతుంది.
 
ఫేస్‌బుక్‌లో కొందరి ఆవేదనలు, అభ్యర్థనలివి...
‘సైదాపేట్‌లోని వేలంకణి స్కూల్ దగ్గర ఓ గర్భిణి చాలసేపటి నుంచి నిలబడే ఉంది. నన్ను క్షమించండి.. ఆమెకు ఎటువంటి సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. మీలో ఎవరికైనా దగ్గర్లో డాక్టర్ అందుబాటులో ఉంటే దయచేసి ఆమెకు సాయం చేయండి. ఆమెకు సాయం చేయడం కోసం---- నంబర్‌కు కాల్ చేయండి’    -అపర్ణా జ్యోతి
 
‘నా స్నేహితురాలు మంగళం మురుగన్ కుటుంబం కె.కె. నగర్‌లోని తమ ఇంట్లో చిక్కుకుంది. రెండంతస్తుల ఆ ఇంట్లోని మొదటి అంతస్తును వరద, డ్రైనేజీ నీరు ముంచేసింది. ఆ ఇంట్లో ఇప్పుడు మూడు నెలల పసిపాప ఉంది. కరెంటు లేదు.. ఉన్న జనరేటర్ నీటిలో మునిగిపోయింది. వాళ్లు కనీసం కాంటాక్ట్‌లో కూడా లేరు. నేను వారికి సాయం చేయలేని స్థితిలో ఉన్నా. దయచేసి.. మీలో ఎవరైనా అక్కడికి దగ్గరగా ఉంటే వారికి సాయం చేయండి’     -సాయికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement