శాన్‌ఫ్రాన్సిస్కో: కొత్త, కొత్త ఆప్షన్లతో యూజర్లను ఆకర్షిస్తున్న సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా మరో సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్‌బుక్ ఇపుడు ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఫీచను లాంచ్ చేసింది.
గత ఏడాది కాలంగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ ఇకపై ఇంటర్నెట్ యూజర్లు ఫేస్‌బుక్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లు నేరుగా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ముందుగా అమెరికా ఈ సేవలను ప్రారంభించింది. ఇకపై మీరు అధికారికంగా ఫుడ్ పికప్ లేదా డెలివరీ కోసం నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హిమెల్, బ్లాగ్‌లో శుక్రవారం ప్రకటించారు. మెనులో 'ఆర్డర్ ఫుడ్' విభాగాన్ని సందర్శించడం ద్వారా సమీపంలోని రెస్టారెంట్లు బ్రౌజ్ చేసి, స్టార్ట్ ఆర్డర్ బటన్ క్లిక్ తో ఇష్టమైన ఫుడ్‌ను ఎంచుకోవచ్చని తెలిపారు. దీంతో ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్‌కు వెళ్లడమో లేదంటే రెస్టారెంట్ల వెబ్‌సైట్లు కానీ,వివిధ యాప్‌లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్‌బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్ ఆర్డర్లు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment