వాట్సాప్ యూజర్లకు శుభవార్త. సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సందర్భానుసారం మనం ఉపయోగించే కంప్యూటర్‌లో జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తుంటాం. అలా కాకుండా కొత్త కంప్యూటర్లలో జీమెయిల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే..జీమెయిల్ ఓపెన్ చేసేది మీరేనా? కాదా అంటూ మన ఫోన్‌లకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ఇదే తరహాలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సైతం లాగిన్ అప్రూవల్ అడుగుతుంది.
త్వరలో వాట్సాప్ సైతం ఈ తరహా సెక్యూరిటీ ఫీచర్‌ను ఎనేబుల్ చేయనుంది. యూజర్లు పొరపాటున కొత్త డివైజ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే మనకు సదరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేది ఎవరని ప్రశ్నిస్తూ ఓ మెసేజ్ పంపుతుంది. ఆ మేసేజ్‌కు మీరు రిప్లయి ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది.
వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..ఎవరైనా “ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్‌లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు 6 అంకెల ఓటీపీని షేర్ చేస్తే.. ఆ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే చివరకు లాగిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చు. అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్‌ను మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే.. ఆఫోన్ వివరాలు, టైంతో పాటు ఇతర సమాచారం పొందవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment