
పవర్ అంటే నాకిష్టం
తమిళసినిమా (చెన్నై): పవర్ అంటే తనకు చాలా ఇష్టమని కాని అది ఆధ్యాత్మికతతో కూడిన పవర్ అని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. శనివారం చెన్నైలో మాట్లాడుతూ ఓ కథ చెప్పారు. ‘ఒక రాజ్యంలో మంత్రి రాజ్యాన్ని వదిలేస్తాడు. ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలు తిరిగి మూడేళ్లకు తిరిగొచ్చాడు. అప్పుడు రాజు మంత్రిని ఏం సాధించావు’ అని అడగ్గా మంత్రి ‘ ఓ రాజా గతంలోఓ మీరు కూర్చున్నారు. నేను నిలబడి మీకు సమాధానం చెప్పేవాడిని.
ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుగా వచ్చిన నన్ను కూర్చోబెట్టి మీరు నిలబడ్డారు. ఇదే నేను సాధించింది’ అని అన్నాడు. నేను ఇష్టపడేది కూడా అలాంటి ఆధ్యాత్మిక పవర్‌నేనని రజనీకాంత్ వివరించారు.