
డోంట్ వర్రీ: రజనీకాంత్
ఇటీవల చెన్నై శివార్లలో ‘2.0’ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రజనీకాంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే దగ్గరలోని హాస్పటల్‌కి ఆయనను తీసుకువెళ్లారు.
ఇటీవల చెన్నై శివార్లలో ‘2.0’ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రజనీకాంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే దగ్గరలోని హాస్పటల్‌కి ఆయనను తీసుకువెళ్లారు. అయితే, గంటలోనే రజనీకాంత్ సెట్‌కి తిరిగొచ్చి షూటింగ్‌కి నేను రెడీ అన్నారట! ‘‘యూనిట్ సభ్యులంతా టెన్షన్ పడుతుంటే.. ‘డోంట్ వర్రీ’ అని ధైర్యం చెప్పారు. ఆయన ప్రొఫెషనలిజం, వ్యక్తిత్వం చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని హీరోయిన్ ఎమీ జాక్సన్ అన్నారు.