సూపర్‌స్టార్‌ చిత్రానికి ఎమీ గుడ్‌బై | Amy Jackson wraps up shooting for Rajinikanth-Akshay Kumar’s ‘2.0’ | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ చిత్రానికి ఎమీ గుడ్‌బై

Published Tue, Mar 7 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

సూపర్‌స్టార్‌ చిత్రానికి ఎమీ గుడ్‌బై

సూపర్‌స్టార్‌ చిత్రానికి ఎమీ గుడ్‌బై

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రానికి ఇంగ్లీష్‌ బ్యూటీ ఎమీజాక్సన్  గుడ్‌బై చెప్పారట. ఏమిటీ షాక్‌ అవుతున్నారా? ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతే కాదు దర్శకుడు శంకర్‌కు థ్యాంక్స్‌ అని కూడా చెప్పుకున్నారు. కాస్త అయోమయంగా ఉంది కదూ ‘రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. ఇది సూపర్‌హిట్‌ చిత్రం ఎందిరన్ కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్నదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ సృష్టికర్త అన్నది తెలిసిన విషయమే. లైకా ప్రొడక్షన్స్   సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌లో రూపొందుతున్న చిత్రంగా నమోదు కానుంది.

ఈ చిత్రంలో రజనీకు జంటగా ఎమీజాక్సన్  నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్  భాణీలు కడుతున్నారు. పలువురు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణలు పనిచేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుత ట్రీట్‌గా ఉండబోతుందని చెప్పవచ్చు. 2.ఓ చిత్రం చివరి పెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తన పోర్షన్ ను నటి ఎమీజాక్సన్  ఆదివారంతో పూర్తి చేశారట.

ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2.ఓ చిత్రం కోసం 18 నెలలు పని చేసినట్లు, ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు శంకర్‌కు  కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లూ ఎమీజాక్సన్ పేర్కొన్నారు. 2.ఓ చిత్రాన్ని రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడా బడ్జెట్‌ రూ.400 కోట్లకు పైగా పెరిగినట్లు సమాచారం. కాగా 3డీ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దీపావళి పండగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement