రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు | complaint on Rajnikanth Linga movie | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు

Published Sun, Dec 14 2014 3:48 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు - Sakshi

రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'లింగా'పై వివాదం ఏర్పడింది. లింగా సినిమాలో తమ కులస్థులను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ బట్రాజు కుల సంఘం నాయకులు ఆరోపించారు. ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement