Linga Movie
-
'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాపై ఓ కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా సినిమాలో భట్రాజులను కించ పరిచేలా డైలాగులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్చమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు. భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. -
రజనీకాంత్ 'లింగా' సినిమాపై ఫిర్యాదు
హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'లింగా'పై వివాదం ఏర్పడింది. లింగా సినిమాలో తమ కులస్థులను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ బట్రాజు కుల సంఘం నాయకులు ఆరోపించారు. ఈ సినిమాపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు. -
లింగా తొలి రికార్డు
లింగా చిత్రం తొలి రికార్డు నమోదు చేసుకుంది. తొలి రోజునే తమిళం, తెలుగు భాషల్లో రూ.15 కోట్లు వసూలు చేసింది. సూపర్‌స్టార్ ర జనీకాంత్ సుమారు నాలుగేళ్ల తరువాత నటించిన కమర్షియల్ చిత్రం లింగా. ఆ మధ్య కోచ్చడయాన్ చిత్రం వచ్చినా అది 3డి యానిమేషన్ చిత్రం కావడంతో రజనీ అభిమానులను అంతగా అలరించలేకపోయింది. దీంతో లింగా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. అభిమానులను సంతృప్తి పరిచే చిత్రంగా లింగా ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తుందంటున్నారుు సినీ వర్గాలు. లింగా చిత్రంలో రజనీకాంత్ శారీరక భాష గానీ, ఆయన స్టైలిష్ యాక్టింగ్ గానీ అభిమానులను కేరింతలు కొట్టిస్తోంది. లింగా చిత్రం ద్వారా రజనీ ఎవర్గ్రీన్ స్టైల్ కింగ్‌గా నిరూపించుకున్నారు. ఇంతకుముందు ఆయన నటించిన ఎందిరన్ తొలిరోజు 11కోట్లు వసూలు చేయగా, లింగా చిత్రం రూ.15 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టిందని ట్రేడ్ వర్గాలంటున్నారుు. లింగా చిత్ర మొత్తం బడ్జెట్ 110 కాగా చిత్ర విడుదల హక్కుల్ని ఇ.రాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 130 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. చిత్ర శాటిలైట్ హక్కులే 80 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. విడుదలైన రోజే తమిళం, తెలుగు భాషల్లో 15 కోట్లు వసూలు చేసిన లింగా శని, ఆదివారాలు సెలవురోజులు కావడంతో ఎంత కలెక్ట్ చేస్తుందోనని సినీ పండితులు అంచనాలు వేసే పనిలో పడ్డారు. తమిళనాడులో 700 థియేటర్లలో విడుదలైన లింగా వారం రోజుల వరకు అడ్వాన్స్ టికెట్ బుక్ అయిపోవడం గమనార్హం. - తమిళసినిమా -
‘లింగా’ ఫీవర్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం విడుదలతో శుక్రవారం రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు, ముఖ్యంగా రజనీ అభిమానులు లింగా ఫీవర్‌తో తపించిపోయారు. రజనీ కటౌట్లను పాలతో ముంచేశారు. ఆలయాల్లో పూజలు నిర్వహించారు. * అర్ధరాత్రి నుంచే ప్రదర్శనలు * రజనీ కటౌట్లకు పాలాభిషేకాలు * ఆలయాల్లో ప్రత్యేక పూజలు * కాశీ థియేటర్‌పై దాడి చెన్నై, సాక్షి ప్రతినిధి: ఒకప్పుడు ఎంజీఆర్.. ప్రస్తుతం రజనీ.. నాడునేడు ఆ మూడక్షరాలు చెబితేనే సినీ ప్రేక్షకులు ఊగి పోతారు. అభిమానులైతే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. మూడేళ్ల విరామం తరువాత అత్యధిక అంచనాలతో లింగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. రజనీ అభిమానులు గురువా రం అర్ధరాత్రి నుంచి థియేటర్లకు చేరుకున్నారు. థియేటర్ల ముందున్న కటౌట్లకు పాలాభిషేకం చేశారు. సీట్లు పంచారు. బాణా సంచా కాల్చారు. సిని మా విజయవంతంగా కావాలని మొక్కుకుంటూ గొర్రెలను బలిచ్చారు. డప్పులు, మేళతాళాలు వా యిస్తూ చిందులు వేశారు. అభిమానులతో కొందరు మహిళలు సైతం కాలుకదిపారు. పుదుచ్చేరీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో లింగా చిత్రాని ప్రదర్శించారు. సేలం లో 14 థియేటర్ల వద్ద పాలాభిషేకం చేశారు. నెల్లైలో రాత్రి 12 గంటలకు జనం క్యూలో నిలుచున్నారు. తిరుచ్చీలోని 12 థియేటర్ల వద్ద రజనీ కటౌట్లపై పూలవర్షం కురిపించి పండ్లు పంచిపెట్టారు. వేలూరులో 27 థియేటర్లలో విడుదల కాగా అక్కడ ప్రత్యే క పూజలు నిర్వహించారు. తేనీ జిల్లాలో రాత్రి 12 గంటలకే లింగా చిత్రాన్ని ప్రదర్శించారు. కోవైలో తెల్లవారుజాము 4 గంటలకే సినిమా హాళ్లన్నీ నిండిపోయా యి. సేలం, ధర్మపురి, నామక్కల్ జిల్లాల్లో 25 థియేటర్లలో సినిమాను ప్రదర్శించలేదు. రజనీకి ఇ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెన్నై తపాలాశాఖ డైరక్టర్ తెలిపారు. నిరాశ ప్రతి జన్మదినం రోజున చెన్నై పాయిస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్ద అభిమానులను కలుసుకోవడం రజనీకాంత్‌కు అనవాయితీ. అయితే ఈ సారి అభిమానులకు నిరాశే మిగిలింది. శుక్రవారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అభిమానులు, యువతులు సైతం రజనీ ఇంటికి బయలుదేరగా మార్గమధ్యం లోనే పోలీసులు నిలిపివేశారు. అభిమానులు అక్కడే రజనీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి వెళ్లిపోయారు. నగరంలో మరో చోట రజనీ అభిమానులు పాలకుండలతో ఊరేగింపు నిర్వహించి ఆ తరువాత అమ్మవారికి పాలాభిషేకం జరిపారు. రజనీ జన్మదినాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు అఖిలభారత రజనీ అభిమానుల సంఘం నిర్వాహులు రామరాజు, సూర్య, రవి తెలిపారు. మోదీ, కరుణ శుభాకాంక్షలు రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోదీ, డీఎంకే అధినేత కరుణానిధి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నూరేళ్లు జీవించాలని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాశీ థియేటర్‌పై దాడి లింగా ప్రదర్శనలో జాప్యం జరగడంతో తట్టుకోలేని రజనీ అభిమానులు చెన్నై ఎంజీఆర్ నగర్‌లోని కాశీ థియేటర్‌పై దాడికి దిగారు. గురువారం అర్ధరాత్రికే థియేటర్ వద్దకు చేరుకున్న అభిమానులు కేక్ కట్‌చేసి రజనీ జన్మదిన వేడుకలు జరిపారు. శుక్రవారం తెల్లవారుజాము 1 గంటకే చిత్రం ప్రదర్శిస్తామని ప్రకటించిన థియేటర్ యాజ మాన్యం 2 గంటలవుతున్నా మిన్నకుండిపోయింది. ఓర్పు నశించిన అభిమానులు థియేటర్ ముందుభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. మరి కొందరు రాళ్లురువ్వి గందరగోళం సృష్టించారు. పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులకు సర్దిచెప్పారు. ఆ తరువాత సినిమా ప్రారంభమైంది. -
'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటించిన కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'లింగా' చిత్రాన్ని నిర్మాత 200 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే. రజనీకాంత్ పుట్టిన రోజు ఈ నెల 12న ఈ సినిమా విడుదలకానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. సెన్సార్ బోర్డ్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ** -
సూపర్‌స్టార్‌తో ఐటమ్ సాంగ్!?
‘‘బాలీవుడ్డా... అసలు ఆ పేరే ఎత్తొద్దు. చిరాకేస్తుంది’’ అంటున్నారు అందాల భామ త్రిష. హిందీలో అక్షయ్‌కుమార్‌తో ఆమె జతకట్టిన ‘కఠ్ఠా మీఠా’ చిత్రం పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రిష మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిషను ‘మళ్లీ బాలీవుడ్లో ప్రయత్నం చేయొచ్చుగా?’ అని మీడియా అడిగితే ఘాటుగా స్పందించారు. ‘‘ఏడాది పాటు సినిమా చేయాలి. మూడు నెలల పాటు ప్రమోషన్లో పాల్గొనాలి. అంత ఓపిక నాకు లేదు. ఆ సమయంలో దక్షిణాదిన రెండు మూడు సినిమాలు చేయొచ్చు. అయినా, ఒక్క సినిమాకే బాలీవుడ్ బోర్ కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణగారితో చేస్తున్నా. ఒక కన్నడ చిత్రం, నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. ఈ సినిమాలు చాలవా! ఇక బాలీవుడ్ దేనికి?’’ అన్నారు త్రిష. ఇదిలావుంటే... త్రిష గురించి ఓ తాజా వార్త సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి త్రిష పచ్చజెండా ఊపేశారట. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన ఈ చిత్రం యూనిట్ నేడో రేపో చిత్రీకరణకు దిగనుందట. రజనీతో జత కట్టాలనేది త్రిష చిరకాల వాంఛ. ఆ కోరిక ఈ రకంగా నిజమవుతున్నట్టుంది. -
రజనీకాంత్ దిష్టిబొమ్మ దహనం
బెంగళూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘లింగ’ సినిమా షూటింగ్‌ను కర్ణాటకలో జరపకుండా నిలిపివేయాలని కర్ణాటక జనపర వేదిక సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే... 2008లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి నీటి వివాదం నడుస్తున్న సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ తమిళులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అయితే అనంతరం ఈ విషయంపై రజనీకాంత్ కన్నడిగులకు క్షమాపణ కూడా చెప్పారు. జీవితంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయని, ఇలాంటి తప్పు మరోసారి జరగదని కూడా అప్పట్లో రజనీకాంత్ వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘లింగ’ సినిమా శుక్రవారం నుంచి రాష్ట్రంలో షూటింగ్ జరుపుకుంటోంది. కర్ణాటకలోని మండ్య, మేలుకొటే, కేఆర్ఎస్ ప్రాంతాల్లో ‘లింగ’ సినిమా షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన కస్తూరి కర్ణాటక జనపర వేదిక సభ్యులు రామనగరలోని ఐజుమూరు సర్కిల్ ప్రాంతంలో ‘లింగ’ సినిమా షూటింగ్‌ను రాష్ట్రంలో జరపరాదంటూ శనివారం ధర్నాకు దిగారు. అంతేకాదు రజనీకాంత్ దిష్టిబొమ్మను దగ్దం చేసి, కావేరి నీటి పంపకం విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్ కర్ణాటకలోనే షూటింగ్ జరుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.