'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా | protest at Linga movie theatre | Sakshi
Sakshi News home page

'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా

Published Mon, Dec 15 2014 3:24 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా - Sakshi

'లింగా'లో డైలాగులు తొలగించాలని ధర్నా

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా సినిమాపై ఓ కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగా సినిమాలో భట్రాజులను కించ పరిచేలా డైలాగులు ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పశ్చమ గోదావరి జిల్లా చింతలపూడిలో లింగా చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద సోమవారం ఆ కుల సంఘం నాయకులు ధర్నా చేశారు. భట్రాజు కుల సంఘం నాయకులు ఇదే విషయంపై ఆదివారం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రజనీకాంత్ నటించిన లింగా చిత్రం తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, టాలీవుడ్ భామ అనుష్క శెట్టి నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement