లింగా తొలి రికార్డు
లింగా చిత్రం తొలి రికార్డు నమోదు చేసుకుంది. తొలి రోజునే తమిళం, తెలుగు భాషల్లో రూ.15 కోట్లు వసూలు చేసింది. సూపర్‌స్టార్ ర జనీకాంత్ సుమారు నాలుగేళ్ల తరువాత నటించిన కమర్షియల్ చిత్రం లింగా. ఆ మధ్య కోచ్చడయాన్ చిత్రం వచ్చినా అది 3డి యానిమేషన్ చిత్రం కావడంతో రజనీ అభిమానులను అంతగా అలరించలేకపోయింది. దీంతో లింగా చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. అభిమానులను సంతృప్తి పరిచే చిత్రంగా లింగా ఉండటంతో వసూళ్ల వర్షం కురుస్తుందంటున్నారుు సినీ వర్గాలు. లింగా చిత్రంలో రజనీకాంత్ శారీరక భాష గానీ, ఆయన స్టైలిష్ యాక్టింగ్ గానీ అభిమానులను కేరింతలు కొట్టిస్తోంది. లింగా చిత్రం ద్వారా రజనీ ఎవర్‌గ్రీన్ స్టైల్ కింగ్‌గా నిరూపించుకున్నారు. ఇంతకుముందు ఆయన నటించిన ఎందిరన్ తొలిరోజు 11కోట్లు వసూలు చేయగా, లింగా చిత్రం రూ.15 కోట్లు వసూలు చేసి ఆ రికార్డును బద్దలు కొట్టిందని ట్రేడ్ వర్గాలంటున్నారుు.
లింగా చిత్ర మొత్తం బడ్జెట్ 110 కాగా చిత్ర విడుదల హక్కుల్ని ఇ.రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 130 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. చిత్ర శాటిలైట్ హక్కులే 80 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. విడుదలైన రోజే తమిళం, తెలుగు భాషల్లో 15 కోట్లు వసూలు చేసిన లింగా శని, ఆదివారాలు సెలవురోజులు కావడంతో ఎంత కలెక్ట్ చేస్తుందోనని సినీ పండితులు అంచనాలు వేసే పనిలో పడ్డారు. తమిళనాడులో 700 థియేటర్లలో విడుదలైన లింగా వారం రోజుల వరకు అడ్వాన్స్ టికెట్ బుక్ అయిపోవడం గమనార్హం.
- తమిళసినిమా