![సూపర్ స్టార్ రజనీకి సీఎం షాక్!](/styles/webp/s3/article_images/2017/09/17/51502000575_625x300.jpg.webp?itok=YzmOnXw4)
సూపర్ స్టార్ రజనీకి సీఎం షాక్!
చెన్నై: రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు పంపుతున్న సూపర్స్టార్ రజనీకాంత్పై తమిళనాడు సీఎం పళనిస్వామి సెటైర్లు విసిరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు ముందుగా ప్రజలకు సేవ చేయాలన్నారు. సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజల మనసులు గెలుచుకోకుండా ఎవరూ అందలం ఎక్కలేరని వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. అమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం తమ ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతోత్సవాల సందర్భంగా పెరంబలూర్లో జరిగిన బహిరంగ సభలో పళనిస్వామి ప్రసంగించారు.