మోడీ ప్రమాణానికి రజనీ దూరం!
చెన్నై: నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకావడం లేదని ఆయన సన్నిహితులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలంటూ రజనీకాంత్ కు మోడీ ఆహ్వానించారు. చెన్నై నగరంలో లేకపోవడం కారణంగానే మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం లేదని సన్నిహితులు వెల్లడించారు.
మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సను ఆహ్వానించడంపై తమిళనాడులో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే .గత రాత్రి తమిళ విద్యార్ధులు పెద్ద ఎత్తున రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దాంతో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీ హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాజపక్స ఆహ్వనంపై డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలతోపాటు అన్ని రాజకీయపార్టీలు, సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికలకు ముందు పోయెస్ గార్డెన్ లో రజనీకాంత్ ను నరేంద్రమోడీ కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే.