
కరుణానిధితో రజనీకాంత్ భేటీ
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధితో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఆదివారం కరుణానిధి నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం రజనీ కాంత్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు.
కాగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోగా, ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అన్నా డీఎంకే ఘనవిజయం సాధించింది. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ చెన్నై వచ్చి రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ప్రధాని కావాలన్న మోడీ కోరిక నెరవేరాలని రజనీ అన్నారు. ఈ నేపథ్యంలో రజనీ కరుణానిధితో భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది.