అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్‌.. వింటేజ్‌ రజనీ ఆన్‌ ది వే | Superstar Rajinikanth Annathe Teaser Released | Sakshi
Sakshi News home page

Annathe Teaser: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్‌.. వింటేజ్‌ రజనీ ఆన్‌ ది వే

Published Thu, Oct 14 2021 8:27 PM | Last Updated on Thu, Oct 14 2021 9:20 PM

Superstar Rajinikanth Annathe Teaser Released - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న ఆప్డేట్‌ వచ్చిన ఆయన ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా రజనీ నటిస్తున్న `అన్నాత్తే` చిత్ర టీజర్‌ని దసరా సందర్భంగా గురువారం సాయంత్రం విడుదల చేశారు. శివ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కథానాయికలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీ క్యారెక్టర్‌ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

టీజర్‌లో.. రజనీ వింటేజ్‌ మార్క్‌ కనిపిస్తోంది. సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపోందించినట్లు తెలుస్తుంది. ఈ ఏజ్‌లోనూ రజనీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు తనదైన మేనరిజం నటనతో ఇరగదీశాడనే చెప్పాలి. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలను పెరగనున్నాయి. రజనీ ఫ్యాన్స్ కి ఈ టీజర్‌ విడుదల చేయడంతో దసరా ప్లస్‌ దీపావళి రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్లు ఉంది.

 

‘అన్నాత్తే’ సినిమాను సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. దీపావలి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నారు. `దర్బార్‌` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే రజనీ అభిమానులు ఆశ పెట్టుకున్నారు. బాక్స్‌ఫీస్‌ ముందు ‘అన్నాత్తే’ ఎటువంటి ఫలితం రాబోతుందంటే దీపావళి వరకు ఆగాల్సిందే మరి.

చదవండి: Nandamuri Balakrishna: మాట‌ల‌తో వాళ్ల‌ను ట్విస్ట్ చేస్తా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement