శంకర్ దర్శకత్వంలో మళ్లీ రజనీ
ఎందిరన్ కాంబినేషన్ రిపీట్ కానుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ హాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారు. వీరి కలయికలో శివాజీ, ఎందిరన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. స్టార్ డెరైక్టర్ శంకర్, రజనీకాంత్‌ను శివాజీ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు. ఎందిరన్ చిత్రంలో రజనీ మరో ముఖం, ఆదిముఖం అయిన విలన్ ముఖాన్ని ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నారు.
ఇప్పుడు మూడవసారి రజనీకి దర్శకత్వం చేయడానికి శంకర్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రజనీ యాక్షన్ లేని చిత్రం చేయాలనడంతో దానికి తగినట్లుగా శంకర్ కథ తయారు చేస్తున్నారట. ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో శంకర్ మహాబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత ఆయన తెరకెక్కించేది రజనీ చిత్రమేనని సమాచారం.