
పూజాహెగ్డే, ప్రభాస్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం. ప్రభాస్, పూజాహెగ్డేల బార్బిడాల్ డ్యాన్స్ పోజుతో రిలీజ్ చేసిన ఈ మొదటి లుక్ లవ్‌లీగా ఉందని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమెద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది. మిగతా షూటింగ్ పార్ట్‌ని కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ప్రారంభించాలనుకుంటున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జీ, మురళీ శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. సందీప్.
Comments
Please login to add a commentAdd a comment