Prabhas Upcoming Movies List | Prabhas Upcoming 8 Pan India Movies - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ చేతిలో 8 పాన్‌ ఇండియా సినిమాలు.. కొత్తగా మూడు

Jan 22 2022 3:15 PM | Updated on Jan 22 2022 3:30 PM

Prabhas Upcoming 8 Pan India Movies - Sakshi

Prabhas Upcoming 8 Pan India Movies: ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్‌.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. వరుస పాన్‌  ఇండియా సినిమాలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవికాకుండా ఆదిపురుష్, సలార్‌, ప్రాజెక్ట్‌ కె, స్పిరిట్‌ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

(చదవండి: హాలీవుడ్‌ సైతం ఆరా తీస్తున్న ఏకైక ఇండియన్‌ హీరో ప్రభాస్‌: నిర్మాత)

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఆదిపురుష్‌ సినిమా చిత్రీకరణ పూర్తయింది ఇదివరకే ప్రకటించారు. అలాగే ప్రాజెక్ట్‌ కె సినిమా కోసం ప్రభాస్‌, దీపికా పదుకొణె మధ్య కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అతివేగంగా సినిమా షూటింగ్స్‌ జరుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు డార్లింగ్‌. ప్రభాస్‌ రేంజ్ తెలిసిన మేకర్స్‌ కూడా డార్లింగ్‌తో సినిమాలు చేసేందుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. పాన్‌ ఇండియా కథలతో ప్రభాస్ ఇంటి డోర్ కొడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ మూడు సరికొత్త చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై బీటౌన్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందించినున్నట్లు తెలుస్తోంది. 

(చదవండి:  ప్రభాస్‌ హైఓల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌.. అన్ని కోట్ల ఖర్చు)

ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా ఒక కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రభాస్‌ ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఈ రెండు కాకుండా డీవీవీ దానయ్యతో ఓ మూవీ చేసేందుకు ఎస్‌ చెప్పాడట ప్రభాస్‌. డైరెక్టర్‌ మారుతి ఓ హార్రర్‌ కామేడీ కథను డార్లింగ్‌కు వినిపించగా దానికి ప్రభాస్‌ ఓకే అన్నాడని తెలుస్తోంది. ప్రభాస్, మారుతి, దానయ్య ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రానున్న సినిమాకు 'రాజా డీలక్స్‌' పేరు ప్రచారంలో ఉంది. ఇదంతా చూస్తుంటే విడుదలకు సిద్ధంగా ఉన్న 'రాధేశ్యామ్‌'తో కలుపుకుని ప్రభాస్‌ మొత్తం 8 చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

(చదవండి:  'స్పిరిట్‌'లో ప్రభాస్‌ రోల్‌ రివీల్‌ !.. ఇక ఫ్యాన్స్‌కు పండగే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement