
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వంలో సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ నిర్మిస్తున్నారు. సోమవారం (మే 10) నరేష్ అగస్త్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
‘‘ఇందులో నరేష్ అగస్త్య హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన అబ్బాయిగా నటిస్తున్నాడు. ‘మత్తు వదలరా’తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న అతను, ‘విహారి’ పాత్రలో తన నటనతో మరోసారి మెస్మరైజ్ చేస్తాడు’’ అన్నారు సృజన్ ఎరబోలు, అఖిలేష్. ‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన విహారి వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య సమతుల్యం పాటించలేక కష్టాలు పడుతుంటాడు. ఈతరం యువతను ప్రతిబింబించేలా విహారి పాత్ర ఉంటుంది’’ అన్నారు హర్ష పులిపాక.
Comments
Please login to add a commentAdd a comment