అంధురాలిగా నయన్‌.. ట్రెండింగ్‌లో ఫస్ట్‌లుక్‌ | Trending: Nayanthara Is Intense In Netrikann First Look Poster | Sakshi
Sakshi News home page

అంధురాలిగా నయన్‌.. ట్రెండింగ్‌లో ఫస్ట్‌లుక్‌

Published Fri, Oct 23 2020 10:24 AM | Last Updated on Fri, Oct 23 2020 11:44 AM

Trending: Nayanthara Is Intense In Netrikann First Look Poster - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్‌' (మూడో కన్ను). ఈ సినిమాలో నయన్‌ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను గురువారం నయనతార ట్విటర్‌ ఫ్యాన్‌ పేజీలో అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఫస్ట్ లుక్‌ చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమనేది అర్ధమవుతోంది. తల నుంచి  రక్తం కారుతున్నా లెక్కచేయకుండా చేతిలో ఆయుధాన్ని ధరించి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లుగా నయనతార కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్న నయన్‌ లుక్‌ ఆసక్తిని పెంచుతోంది. చదవండి: ఆలయంలో నయన్‌-శివన్‌ల వివాహం!

మర్డర్‌ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్‌ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేష్‌శివన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విషేషం ఏంటంలే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్‌ శివన్‌ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మిలింద్‌ రౌ దర్శకుడు. గిరిష్‌ జి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల సందర్భంగా తమిళ సెలబ్రిటీలు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్‌ ట్విట్టర్‌ ద్వారా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ఓటీటీలో గోపీచంద్-నయన్‌‌ చిత్రం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement