రాహుల్, వెంగి, గోవర్థన్ రెడ్డి, హిమజ, సైదిరెడ్డి చిట్టెపు
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘జ’. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై సైదిరెడ్డి చిట్టెపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మించారు. హిమజ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిథిగా హాజరై ‘జ’ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదల చేశారు. సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ – ‘‘జ’ అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం.
ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి’’ అన్నారు. ‘‘నేను డాక్టర్‌ని. దర్శకుడు సైదిరెడ్డి చెప్పిన కాన్సెప్ట్ నచ్చి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను’’ అన్నారు ఉపేందర్. ‘‘సైదిరెడ్డి నాలుగేళ్లు కష్టపడి మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు గోవర్థన్ రెడ్డి. ‘‘ఇందులో నాది నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర. నటిగా మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది’’ అన్నారు హిమజ. ‘‘ఈ చిత్రంలో నాలుగు డిఫరెంట్ పాటలు ఉన్నాయి’’ అన్నారు సంగీత దర్శకుడు వెంగీ.
Comments
Please login to add a commentAdd a comment