
Rekki Movie First Look Released At Film Chamber: స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు అన్నది ట్యాగ్‌లైన్. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు.
క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.