Rekki
-
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
బెడిసికొట్టిన జనసేన, టీడీపీ వికృత వ్యూహాం
-
పవన్ పై ఎలాంటి రెక్కీ జరగలేదని తేల్చిన పోలీసులు
-
వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూ లేదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వంగవీటి రాధాకు ఎలాంటి ముప్పూలేదని, ఆయన భద్రతపై ఎవ రూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ నగర పోలీసు క మిషనర్ టి.కె.రాణా స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాణా మా ట్లాడుతూ.. తనకు ప్రాణహాని ఉంద ని బహిరంగ వేదికపై రాధా చేసిన ప్ర కటనపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేశా మన్నారు. రాధా ప్రకటనతో పోలీస్ విచారణతో సంబంధం లేకుండా ప్రభుత్వం తక్షణమే గన్‌మెన్‌ను ఏర్పా టు చేసిందని చెప్పారు. అప్పటి నుంచి పోలీస్‌శాఖతో పాటు, మల్టిపు ల్ ఏజెన్సీల ద్వారా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామన్నారు. ఆయన ఇంటి పరిసరాలు, నగరంలోని అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు చెప్పారు. రెక్కీపై నిర్దిష్టమైన ఆధారా లు లేవని తెలిపారు. ఆయన్ని ఇబ్బం దులు పెట్టేలా ఎవరూ ప్రయత్నిం చలేదని, ఆయన ఇంటి వద్ద ఎవరూ రెక్కీ నిర్వహించలేదని వెల్లడైందన్నా రు. అయినప్పటికీ అన్ని కోణాల్లో ఇంకా విచారణ సాగిస్తున్నామని తెలి పారు. దీనిపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కో రారు. ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు పోలీస్ శాఖపై చేసిన ఆరోపణలను తప్పుబట్టారు. ఎలాంటి నేరపూరిత ఘటన జరగని ఈ ప్రకటనపై జీరో ఎఫ్ఐఆర్ నమో దు చేసేందుకు ఆస్కారం లేదని చె ప్పారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు. దీనికి భంగం కలిగించొద్దని కోరారు. -
మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ" ఫస్ట్‌లుక్ రిలీజ్
Rekki Movie First Look Released At Film Chamber: స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు అన్నది ట్యాగ్‌లైన్. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
జెమిని కిరణ్ చేతుల మీదుగా ‘రెక్కీ’ఫస్ట్‌లుక్!
‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 27, సోమవారం ఉదయం ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ ఆవిష్కరించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న ‘రెక్కీ"’ఫస్ట్ లుక్ ఆవిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపి అతి త్వరలో సిద్ధం కానుంది. -
సక్సెస్ కోసం ‘రెక్కీ’చేస్తున్నారు
‘స్నోబాల్ పిక్చర్స్’ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రెక్కీ’. ‘కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు’ అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు. -
నా ఇంటిపై రెక్కీ: మాలిక్
ముంబై: ముంబై క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), సంస్థ ఉన్నతాధికారి సమీర్ వాంఖెడేలపై కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఈసారి కొత్త ఆరోపణలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తన ఇల్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారని శనివారం ముంబైలో ఆరోపించారు. ‘ గత వారం నేను దుబాయ్‌లో ఉన్నపుడు ముంబైలో నా ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ నిర్వహించారు. కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇల్లు, ఆఫీస్, మనవళ్ల పాఠశాలల వద్ద కెమెరాలతో ఫొటోలు తీశారు. మా సమాచారం సేకరించారు. నా దగ్గర సాక్ష్యాలున్నాయి. తప్పుడు కేసులు పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేసిన వాట్సాప్ చాట్స్ నా వద్ద ఉన్నాయి. నాపై కేసులు పెడితే ఊరుకోను. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలేలకు ఫిర్యాదుచేస్తా’ అని నవాబ్ మాలిక్ హెచ్చరించారు. -
అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్ 2019 బాలాకోట్ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
గుంటూరులో గజదొంగ!
పేరుమోసిన గజదొంగ గుంటూరు నగరంలో రెక్కీ నిర్వహించాడన్న సమాచారంతో జిల్లా పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ దొంగ ఉత్తర భారత్‌కు చెందిన ప్రమాదకర నేరస్తుడని ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా గుంటూరుతోపాటు, పట్టణాల్లోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు రహస్యంగా తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాక్షి, గుంటూరు: రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరులో గజదొంగ సంచరించా డంటూ వచ్చిన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీసు యంత్రాంతం ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైంది. అత్యంత ప్రమాదకరమైన ఈ దొంగ ముందస్తుగా రెక్కీ నిర్వహించి ఉంటాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఉత్తర భారతదేశానికి చెందిన వాడిగా భావిస్తున్న గజదొంగ కదలికలు గుంటూరు నగరంలో కనిపిం చాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక గాలింపు చేపట్టింది. గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతోపాటు, గుంటూరు నగరంలో కూడా హోటళ్లు, లాడ్జీల్లో రహస్యంగా తనిఖీలు చేపట్టి, ఆయా గదుల్లో ఉన్న వారి వివరాలను తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పుటేజీలు, లాడ్జీ ల్లోని రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పదంగా గుర్తించిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇదంతా రహస్యంగా కొనసాగిస్తుండటంతో విషయాలు బయటకు పొక్కడం లేదు. నగర పరిధిలోని సీసీ కెమెరాల పుటేజీలను కూడా పోలీసు కంట్రోల్ రూము ద్వారా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో జిల్లాలోని కౌంటర్ ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ గజదొంగ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒక రోజంతా గుంటూరు నగరంలో, ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీలో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని తెలిసింది. అయితే అతను ఏ పేరు, చిరునామా ఇచ్చాడనే విషయాలను పోలీసులు రహస్యంగా ఉంచుతున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. తెలంగాణలో భారీ చోరీ మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో బంగారు దుకాణంలో అంతరాష్ట్ర దొంగలు చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా ఎస్పీలను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా నైట్ బీట్లను పటిష్టం చేయడంతోపాటు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ దొంగ రోజంతా నగరంలో ఉండటంతోపాటు, జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కూడా సంచరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏదేమైనా నేరాలు, దొంగతనాలకు పాల్పడే ముఠా కన్ను జిల్లాపై పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కొనసాగించాలంటూ ఎస్పీలు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
పది రోజుల ముందే ఇంట్లో కుక్కను చంపారా..
గుడివాడ: పట్టణంలో దంపతుల హత్య పథకం ప్రకారమే చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులు ముందుగానే రెక్కీ నిర్వహించి హతమార్చినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి గుడివాడ రాజేంద్ర నగర్లో చోటుచేసుకున్న బొప్పన సాయిచౌదరి దంపతుల హత్య ఇంక మిస్టరీగానే ఉంది. హంతకులు తెలివిగా వ్యవహరించి తమిళనాడులోని పోలీసు స్టేషన్లో సరెండర్ అయ్యారని చెబుతున్నారు. ఈ కేసులో గుడివాడ దనియాలపేటకు చెందిన గిన్నెల సురేస్తోపాటు చెన్నైకి చెందిన శివ కూడా ఉన్నట్లు సమాచారం. దంపతుల హత్యకు హంతకులు ముందుగానే రెక్కీ నిర్వహించి హత్యచేశారని తెలుస్తోంది. సాయి చౌదరికి చెందిన కుక్క ఆకస్మాత్తుగా చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు . ఇది ఉంటే ఇంట్లోకి ఎవరినీ రానివ్వదని అది అడ్డువస్తుందని ముందగానే చంపి ఉంటారని భావిస్తున్నారు. లోపలికి ప్రవేశించేందుకుగాను పై ఇంటి కిటికీ గ్రిల్స్‌ను ముందుగానే కట్‌చేసి ఉంటారని అంటున్నారు. ఇంట్లో ఉన్న సెల్ఫోన్లో ఏమైనా వీడియో రికార్డింగ్ చేసి ఉంటాడని ఐఫోన్, టీవీని తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతుచిక్కని కారణాలు..? దంపతులను హత్య చేయటానికి కారణాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. ఆస్తి పరమైన కారణాలా? ఆర్థికపరమైన లావాదేవీలా అనే అంశం తెలియాల్సి ఉంది. -
రెక్కీ లేకుండా ఎటాక్!
⇒ఐదు నెలల క్రితం నేరాలు మొదలు ⇒ఇప్పటికి చోరీకి యత్నించింది 40 చోట్ల ⇒ ‘వాకింగ్ డ్రస్’లో వస్తూ చేతివాటం సిటీబ్యూరో: ఓ దొంగ ఏదైనా ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నప్పుడు ముందుగా రెక్కీ చేస్తాడు. ఆ ఇంటి పరిసరాలను పూర్తిగా గమనించిన తర్వాతే చోరీకి యత్నిస్తాడు. అయితే ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా చోరుడు గఫార్ ఖాన్ అలియాస్ జిగర్ పంథానే వేరు. ఎలాంటి రెక్కీలూ లేకుండా నేరుగా ఎటాక్ చేయడం ఇతడి నైజం. యాకత్‌పురకు చెందిన జిగర్ ఎంజే మార్కెట్లో తండ్రితో కలిసి పూల వ్యాపారం చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత ఏడాది నవంబర్‌లో చోరీల బాటపట్టాడు. మలక్‌పేటతో ప్రారంభించి ఐదు నెలల కాలంలో ఏకంగా 19 ఇళ్లలో చోరీలు చేశాడు. అర్ధరాత్రి వేళ బయలుదేరే ఇతగాడు దారిలో ఎవరికీ అనుమానం రాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకునేవాడు. వాకింగ్‌కో, జాగింగ్‌కో వెళ్తున్నట్లు ట్రాక్స్, టీ–షర్ట్, నెత్తిన టోపీతో వస్తాడు. సంపన్నులు నివసించే ప్రాంతాలను ఎంచుకుని ఓ చోట తన హోండా యాక్టివాను పార్క్ చేసి ఆగుతాడు. ఆ చుట్టపక్కల ఉన్న వాటిలో అనువైన ఇళ్లలోకి ప్రవేశించి చోరీకి యత్నిస్తాడు. ఇలా గడిచిన ఐదు నెలల కాలంలో దాదాపు 40 ఇళల్లలోకి ప్రవేశించాడు. ఒకటి, రెండతస్తుల ఇళ్లలోకి వంటగది తలుపులు, కిటికీల నుంచి ప్రవేశించి జిగర్ యజమానులు ఉన్నప్పుడే చోరీలు చేస్తుంటాడు. 40 ఇళ్లలో ప్రయత్నించిన ఇతడు 19 చోట్ల ‘సఫలీకృతుడై’ కేజీన్నర బంగారం, నగదు చోరీలు చేయగలగాడు. ఇలా వచ్చిన సొత్తును ఘాన్సీ బజార్‌కు చెందిన ముగ్గురు రిసీవర్లకు అమ్మేవాడు. ఆ సొమ్మును అన్ని రకాలైన జల్సాలు చేస్తూ ఖర్చు చేసేవాడు. మలక్‌పేట, సరూర్‌నగర్, సంతోష్‌నగర్ ఇలా మొత్తం ఎనిమిది ఠాణాల పరిధిలో 19 నేరాలు చేశాడు. నేరం చేసే సందర్భంలో ఖర్చీఫ్‌ను నోట్లో పెట్టుకోవడమో, ముక్కుకు కట్టుకోవడమో చేస్తుంటాడు. అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఇతడి కదలికలు రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా ఒకే నేరగాడి పనిగా నిర్ధారించారు పోలీసులు. ఈ ఆధారాలతో రంగంలోకి దిగిన తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేసి శనివారం జిగర్‌తో పాటు రిసీవర్లను పట్టుకోగలిగారు. వరుసగా చోరీలు చేసిన ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.