పది రోజుల ముందే ఇంట్లో కుక్కను చంపారా.. | Couples Murder Pre Plan Murder? | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే హత్య?

Published Tue, Mar 20 2018 9:27 AM | Last Updated on Wed, Jul 10 2019 8:02 PM

Couples Murder Pre Plan Murder? - Sakshi

గుడివాడ: పట్టణంలో దంపతుల హత్య పథకం ప్రకారమే చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హంతకులు ముందుగానే రెక్కీ నిర్వహించి హతమార్చినట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి గుడివాడ రాజేంద్ర నగర్‌లో చోటుచేసుకున్న బొప్పన సాయిచౌదరి దంపతుల హత్య ఇంక మిస్టరీగానే ఉంది. హంతకులు తెలివిగా వ్యవహరించి తమిళనాడులోని పోలీసు స్టేషన్‌లో సరెండర్‌ అయ్యారని చెబుతున్నారు. ఈ కేసులో గుడివాడ దనియాలపేటకు చెందిన గిన్నెల సురేస్‌తోపాటు చెన్నైకి చెందిన శివ కూడా ఉన్నట్లు సమాచారం.

దంపతుల హత్యకు హంతకులు ముందుగానే రెక్కీ నిర్వహించి హత్యచేశారని తెలుస్తోంది. సాయి చౌదరికి చెందిన కుక్క ఆకస్మాత్తుగా చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు . ఇది ఉంటే ఇంట్లోకి ఎవరినీ రానివ్వదని అది అడ్డువస్తుందని ముందగానే చంపి ఉంటారని భావిస్తున్నారు. లోపలికి ప్రవేశించేందుకుగాను పై ఇంటి కిటికీ గ్రిల్స్‌ను ముందుగానే కట్‌చేసి ఉంటారని అంటున్నారు. ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌లో ఏమైనా వీడియో రికార్డింగ్‌ చేసి ఉంటాడని ఐఫోన్, టీవీని తీసుకెళ్లారని చెబుతున్నారు.

అంతుచిక్కని కారణాలు..?
దంపతులను హత్య చేయటానికి కారణాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. ఆస్తి పరమైన కారణాలా? ఆర్థికపరమైన లావాదేవీలా అనే అంశం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement