ఇట్లు... ప్రజానీకం | Allari Naresh Itlu Maredumilli Prajaneekam First look Release | Sakshi
Sakshi News home page

ఇట్లు... ప్రజానీకం

Published Wed, May 11 2022 6:21 AM | Last Updated on Wed, May 11 2022 6:22 AM

Allari Naresh Itlu Maredumilli Prajaneekam First look Release - Sakshi

అడవిలో నివాసం ఉండే ఓ తెగకు సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెండితెరపై పోరాడుతున్నారు ‘అల్లరి’ నరేశ్‌. అది ఏ సమస్య? ఆ సమస్యకు ఎలా పరిష్కారం లభించింది? అనే విషయాలను సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. ‘నాంది’ తర్వాత ‘అల్లరి’ నరేశ్‌ హీరోగా చేస్తోన్న మరో చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.

ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌. రాజేష్‌ దండు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ మోహన్‌ దర్శకుడు. మంగళవారం (మే 10) ‘అల్లరి’ నరేశ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement