విల‌న్‌గా జ‌య‌సుధ తనయుడి ఎంట్రీ | Jayasudha Son Nihar Kapoor As Villain In Gangster Gangaraju | Sakshi

‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’లో విల‌న్‌గా జ‌య‌సుధ తనయుడు

Sep 7 2021 8:03 PM | Updated on Sep 7 2021 9:07 PM

Jayasudha Son Nihar Kapoor As Villain In Gangster Gangaraju - Sakshi

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క‌థానాయ‌కుడు ల‌క్ష్య్‌. ‘వ‌ల‌యం’ వంటి గ్రిప్పింగ్‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు త‌న‌దైన పంథాలో ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఇటీవల విడుదలైన ల‌క్ష్య్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ నటి జయసుధ తనయుడు నిహార్‌ కపూర్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాతో నిహార్ క‌పూర్ విలన్‌గా వెండితె ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

చదవండి: Bigg Boss 5 Telugu: అలా ఏడిస్తే హౌజ్‌ నుంచి ముందుగా వచ్చేది నువ్వే

మంగ‌ళ‌వారం నిహార్ క‌పూర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ మూవీ యూనిట్ అతడి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. చేతిలో క‌త్తి ప‌ట్టుకుని, గ‌డ్డంతో ఉన్న నిహార్ లుక్ చూస్తుంటే భ‌యం గొలిపేలా ఉంది. క‌చ్చితంగా త‌న‌కు ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ న‌టుడిగా మంచి గుర్తింపు తెస్తుంద‌ని భావిస్తున్నాడు నిహార్‌. ప్రముఖ నిర్మాణ  సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. 

చదవండి: ‘తలైవి’ ప్రమోషన్స్‌: మరోసారి బాలీవుడ్‌పై నిప్పులు చెరిగిన కంగనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement