‘‘హైటెక్ లవ్, బెస్ట్ లవర్స్’ వంటి చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. జినుకల హరికృష్ణ డైరె క్టర్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నీలం ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకరణ్ ప్రొడక్షన్ పతాకంపై గొంటి శ్రీకాంత్, గుంజ శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. జినుకల హరికృష్ణ మాట్లాడుతూ–‘‘క్రైమ్,సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఉంటాయి.
సామాజిక విలువలతో పాటు వాణిజ్య హంగులు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘అన్ని వర్గాలను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీకాంత్ . ‘‘ఈ సినిమా నాకు మంచి మాస్ హీరోగా గుర్తింపు తెస్తుంది. నా పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసినందుకు యూనిట్‌కు కృతజ్ఞతలు’’ అన్నారు శ్రీకరణ్. ఈ చిత్రానికి సహ నిర్మాత: డి. అల్లిబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అల్లం నాగిశెట్టి నాయుడు, కెమెరా: రాము, సంగీతం: విజయ్ బాలాజీ.
Comments
Please login to add a commentAdd a comment