
అనురాగ్ కొణిదెన
‘‘ఒక అందమైన కలను కథగా మార్చుకుని ప్రకృతి సృష్టించుకున్న అద్భుతమైన ప్రేమ కావ్యం మా ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుంది. ఆ ప్రకృతే ఓ ప్రేమను సృష్టిస్తే ఇంకెంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమే మా సినిమా’’ అన్నారు సాయిదేవ రామన్. అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ కథానాయికలు. సాయిదేవ రామన్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్‌పై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు.
కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్, వైజాగ్, అరకులోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే ప్రధాన బలం. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు అనురాగ్. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి సతీష్ పాలకుర్తి.
Comments
Please login to add a commentAdd a comment