
కౌండిన్య ప్రొడక్షన్ బ్యానర్ పై జి.నరసింహ గౌడ్ ప్రొడ్యూసర్ గా ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ చిత్రం 'ఫైటర్ శివ'. మణికాంత్, శీతల్ భట్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రం లో హీరో సునీల్ సిబీఐ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరోనా కారణం గా ఇబ్బందులు పడుతున్న కళాకారులకి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ.. ‘రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాం.. చివరి షెడ్యూల్ ప్లాన్ చేశాం. సినిమా ఇప్పటివరకు బాగా వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ను భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. కానీ లాక్ డౌన్ వల్ల అది కుదరలేదు. కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు పది రోజులకు సరిపడా రేషన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించింది. వెంటనే కో ఆర్డినేటర్ కృష్ణ ను సంప్రదించి, కళాకారులను పిలిపించి, వారి సమక్షంలోనే ఈ సినిమా పోస్టర్ లాంచ్ జరిపించి 200 మంది కళాకారులకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్&ఫైనాన్సర్ చింతపల్లి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
నిర్మాత జి.నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ తర్వాత సినిమా మూడో షెడ్యూల్ చేస్తాం. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.. హీరో హీరోయిన్ లు చక్కగా నటించారు.. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment