
పులగం చిన్నారాయణ, కృష్ణ, జిలాన్ బాషా
‘‘నేను స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో విఠలాచార్యగారి సినిమాలు చాలా చూశాను. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ఒకే ఒక సినిమా ‘ఇద్దరు మొనగాళ్లు’ హిట్ అయ్యింది. గొప్ప దర్శకుడు, సక్సెస్‌ఫుల్ నిర్మాత అయిన ఆయనపై పుస్తకం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన సినీ ప్రయాణం నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ రాసిన ‘జై విఠలాచార్య’ పుస్తకం ఫస్ట్ లుక్‌ని కృష్ణ విడుదల చేశారు.
‘‘సినిమా నిర్మాణంలో విఠలాచార్యగారు పెద్ద బాలశిక్ష లాంటివారు. కరోనా సమయంలో విఠలాచార్య శత జయంతి సందర్భంగా ఈ పుస్తకానికి అంకురార్పణ చేసి, త్వరగా రాశాను. రచయితగా నా తొమ్మిదవ పుస్తకమిది’’ అని పులగం చిన్నారాయణ అన్నారు. ‘‘జై విఠలాచార్య’ను మా తొలి పుస్తకంగా పబ్లిష్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని ‘మూవీ వాల్యూమ్’ షేక్ జిలాన్ బాషా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment