రొమాంటిక్ చిత్రంగా 'ఈ కథలో నేను'.. ఫస్ట్​లుక్​ విడుదల | Ee Kathalo Nenu Movie Title Logo Released | Sakshi
Sakshi News home page

Ee Kathalo Nenu Movie: రొమాంటిక్ చిత్రంగా 'ఈ కథలో నేను'.. ఫస్ట్​లుక్​ విడుదల

Published Sun, Feb 27 2022 7:58 PM | Last Updated on Sun, Feb 27 2022 8:06 PM

Ee Kathalo Nenu Movie Title Logo Released - Sakshi

Ee Kathalo Nenu Movie First Look Released: హోమానంద్​, రేవంత్​ సిమ్రాన్​ పరింజా (తెలుగు కిర్రాక్​ పార్టీ సినిమా ఫేం) హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరెకెక్కుతున్న సినిమా 'ఈ కథలో నేను'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, గోవా పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సాయిమాధవ్​ బుర్రా ఈ సినిమాకు ప్రముఖ మాటల రచయితగా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్​ప్లే కూడా అందించారు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను చిత్రబృందం శనివారం (ఫిబ్రవరి 26) విడుదల చేసింది. త్వరలో ఫస్ట్​ లుక్​ను రిలీజ్​ చేయనున్నట్లు మేకర్స్​ తెలిపారు. 

ఈ సినిమాకు యంయస్​. ఫణిరాజ్ దర్శకత్వం వహించగా టీవీ కేశవతీర్థ అవతార్​ ఫిలింస్​ బ్యానర్​పై ప్రొడక్షన్​ నెం 1గా నిర్మించారు. ఈ చిత్రానికి దివంగత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సాయికిరణ్​, రెహమాన్​, సాగర్ సాహిత్యం అందించారు. మధు రెడ్డి ఎడిటర్​గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శ్రీయోగి సంగీతం సమకూర్చారు. మల్హర్ బట్ జోషి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేయగా ఎం. అచ్చిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్​గా  బాధ్యతలు నిర్వర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement