Mohan Babu Manchu New Movie Son Of India First Look Released | సన్నాఫ్‌ ఇండియా ఫస్ట్‌లుక్‌ విడుదల - Sakshi
Sakshi News home page

సన్నాఫ్‌ ఇండియా ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Fri, Jan 29 2021 11:21 AM | Last Updated on Fri, Jan 29 2021 12:57 PM

Mohan Babu Released His New Movie Son Of India First Look - Sakshi

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు మంచు తన సినిమా ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన హీరోగా గతంలో వచ్చిన ‘గాయత్రి’ మూవీ తర్వాత కేవలం అతిథి పాత్రల్లోనే కనిపించారు. కనిపించేది కొద్ది సమయమే కథను మలుపు తిప్పే కీలక పాత్రలు పోషిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన ఫుల్‌లెంగ్త్‌‌ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు ‘సన్నాఫ్‌ ఇండియా’గా వస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఆయన టైటిల్‌ రోల్‌  పోషిస్తున్నారు. ఈ క్రమంలో సన్నాఫ్‌ ఇండియా సినిమా ఫస్ట్‌ లుక్‌ను మోహన్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు.

‘దేశభక్తి అతడి రక్తంలోనే ఉంది.. ‘సన్నాఫ్‌ ఇండియా’ను కలుసుకోండి’ అంటూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన సీరియస్‌ లుక్‌లో.. మెడలో రుద్రాక్ష మాలతో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. కాగా ఇటీవల పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement