కార్తీ దొంగ | Karthi and Jyothika's next film title and first-look reveal | Sakshi
Sakshi News home page

కార్తీ దొంగ

Published Sat, Nov 16 2019 5:06 AM | Last Updated on Sat, Nov 16 2019 5:06 AM

Karthi and Jyothika's next film title and first-look reveal - Sakshi

కార్తీ, జ్యోతిక

వదిన జ్యోతిక, మరిది కార్తీ తొలిసారి కలిసి నటించిన తమిళ చిత్రం ‘తంబి’. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూరజ్‌ సదన్‌ నిర్మించిన ఈ సినిమాని  తెలుగులో ‘దొంగ’ పేరుతో డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ‘దొంగ’ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హీరో సూర్య రిలీజ్‌ చేశారు. ‘‘ఏడాదిగా ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రం తెరకెక్కిన విధానం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు కార్తీ. ఈ సినిమా టీజర్‌ నేడు విడుదలవుతోంది. కార్తీ హీరోగా ఇటీవల వచ్చిన ‘ఖైదీ’, ఇప్పుడు ‘దొంగ’ టైటిల్స్‌ చిరంజీవి నటించిన సినిమా టైటిల్సే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement