Rana Daggubati Virata Parvam | Virata Parvam First Glimpse | Comrade Ravana - Sakshi
Sakshi News home page

సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం: కామ్రేడ్‌ రవన్న

Published Mon, Dec 14 2020 11:54 AM | Last Updated on Mon, Dec 14 2020 12:59 PM

Comrade Ravanna from ViraataParvam first glimpse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘విరాటపర్వం’ లో క్రామేడ్‌ రవన్న ప్రీలుక్‌ను సోమవారం పరిచయం చేసింది చిత్ర యూనిట్‌. వేణు ఉడుగుల  దర్శకత్వంలో 1990వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్‌ అలియాస్‌ న‌క్స‌లైట్ నాయ‌కుడు కామ్రేడ్‌ రవన్నగా రానా  తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నారు. (రానా బ‌ర్త్‌డే, మూవీ ఫ‌స్ట్ లుక్)

‘‘సత్యా న్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. ఒకదేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది’’ అంటూ రవన్న ప్రాతను పరిచయం చేశారు. అలాగే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అనే  నినాదం వినిపించడం విశేషం. ఈ మూవీలో కీలక పాత్రలు పోషస్తున్న హీరోయిన్‌ సాయిపల్లవి, ప్రియమణి లుక్స్  ఇప్పటికే రిలీజ్‌ అయ్యాయి.  అలాగే  రానా ఫస్ట్‌ లుక్‌ ఇప్పటికే ఫ్యాన్స్‌ను  ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన రానా రవన్న ప్రీ లుక్ ఆసక్తికరంగా మారింది. 

సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. "మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం." అనే సందేశంతో ప్రియమణి లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.  నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ  ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలను శరవేగంగా ముగించుకుని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement